బియ్యం ఎగుమ‌తుల‌పై ప‌న్ను..కేంద్రం నిర్ణ‌యం

బియ్యం ఎగుమ‌తుల‌పై ప‌న్నుతో పాటు నూక‌ల‌ను నిషేధిస్తే కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్పటికే గోధుమ‌, దాని ఆధారిత ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌పై ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే బియ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చింది.అన్ని బాస్మ‌తీయేత‌ర బియ్యంపై 20 శాతం మేర ఎగుమ‌తి సుంకాన్ని విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అదేవిధంగా నూక‌ల ఎగుమ‌తుల‌పై పూర్తి నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.అయితే, ప్ర‌స్తుతం ఎగుమ‌తికి సిద్ధంగా ఉన్న వాటికి మాత్రం ఆంక్ష‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించింది.

ఈనెల 15 వ‌ర‌కు ఈ మిన‌హాయింపులు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.కాగా, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగానే కేంద్రం ఆహార ధాన్యాల ఎగుమ‌తుల‌పై ఆంక్ష‌లు విధిస్తోంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Advertisement
ఆ థియేటర్ లో 200 రోజులు ఆడిన గుంటూరు కారం.. మహేష్ ఖాతాలో మరో రేర్ రికార్డ్!

తాజా వార్తలు