తాప్సీ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి .తాప్సి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.
రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది తాప్సి.ఈ సినిమా వచ్చి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది.
ఈ పది సంవత్సరాలలో తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి పేరు సంపాదించుకుంది.తెలుగులో ఎక్కువగా గ్లామరస్ పాత్రలలోనే కనిపించే తాప్సి, బాలీవుడ్ లో మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుని సినిమాలు చేస్తూ వస్తుంది.
తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది.సినిమాల్లో బిజీ గా ఉండే తాప్సి ప్రేమలో కూడా పడినట్లు కొన్ని వార్తలు కూడా వచ్చాయి.
చాలా రోజుల నుంచి ఈమె ప్రేమలో ఉందనే విషయం అందరికి తెలిసిందే.కానీ తాప్సి ప్రేమలో పడిన వ్యక్తి ఎవరు అనేది మాత్రం చెప్పలేదు తాప్సీ.
తను ప్రేమలో పడిన వ్యక్తి ఇండస్ట్రీకి సంబందించిన మనిషి కాదని మాత్రం ఇదివరకే చెప్పుకొచ్చింది.అయితే ఇప్పుడు తాప్సి లవర్ ఎవరనేది బయటపెట్టింది.
అంతేకాకుండా, కొంత కాలం క్రితం తన ప్రియుడితో కలిసి మాల్దీవులకు కూడా వెళ్లింది.మళ్ళీ ఇప్పుడు తన ప్రియుడు గురించి ఇలా చెప్పుకొస్తుంది.డెన్మార్క్ కు చెందిన షట్లర్ మతియాస్ బోయ్ తో ఆమె రిలేషన్ లో ఉంది.తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి పబ్లిక్‌గా అందరితో మాట్లాడటానికి తనకేం మొహమాటం లేదని చెప్పింది ఈ భామ.అయితే తన పర్సనల్ లైఫ్, ప్రొఫిషనల్ లైఫ్ రెండూ వ్యతిరేకంగా ఉంటాయని చెప్పింది.ఇక మీదట కూడా అలాగే ఉంచాలనుకుంటానని అంది.
తన వ్యక్తిగత జీవితంలో ప్రియుడు మథియాస్ కూడా ఒక భాగమని చెప్పుకొచ్చింది తాప్సీ.ప్రేమలో అయితే ఉన్నాను కానీ, పెళ్లి గురించి మాత్రం ఇప్పుడు ఆలోచించడం లేదని చెప్పుకొచ్చింది తాప్సీ.
అంతేకాకుండా మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందని, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిని కూడా బ్యాలన్స్ చేసుకుంటూ రావాలని చెప్పింది.అందుకే తాప్సి ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయడం కంటే కూడా రెండు, మూడు సినిమాలు ఒప్పుకుంటే అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ రెండు కూడా బ్యాలన్స్ గా ఉంటాయని అంటుంది.
అప్పుడే లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు.అందుకే రెండింటికీ టైమ్ కేటాయిస్తున్నాని చెప్పుకొచ్చింది తాప్సీ.
ప్రస్తుతం తాప్సి రష్మీ రాకెట్ అనే చిత్రంలో నటిస్తోంది.అలాగే హసీన్ దిల్ రుబా, లూప్ లుపేట సినిమాల్లో తాప్సి కనిపించనుంది.ఈ సినిమాలతో బాలీవుడ్ లో టాప్ ప్లేస్ కు వెళ్లాలని అనుకుంటోంది తమిళంలో జనగణమన చిత్రంతో పాటు మరో సినిమా కూడా చేస్తోంది.ఇక పెళ్లి అయితే ఇప్పుడే ఉండదు అని ఆమె క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం తన ద్యాస అంతా సినిమాలపైనే ఉందని చెప్పింది తాప్సి పన్ను.