స్టార్ హీరో కుమారుడు కాబట్టి మరో అవకాశం వచ్చిందట,తాప్సి అసహనం

టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిన తాప్సి పన్ను స్టార్ హీరో కుమారుడి పై తన అసహనం వ్యక్తం చేసింది.

నో ఫిల్టర్ నేహా షో లో పాల్గొన్న తాప్సి బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు హర్ష వర్ధన్ కపూర్ ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అతడు తోలి సినిమా అట్టర్ ప్లాప్ అయినప్పటికీ స్టార్ హీరో కుమారుడు కాబటికి అతడికి రెండో సినిమా చేసే అవకాశం లభించింది,అదే నాకు అలాంటిది జరిగిఉండి ఉంటె మాత్రం అసలు కెరీర్ అన్నదే లేకుండా పోయేది అంటూ ఒకరకంగా తన అసహనం వ్యక్తం చేసింది.

అంటే స్టార్ హీరో కుమారుడు కాబట్టి రెండో సినిమా అవకాశం లభించింది, లేదంటే కెరీర్ అనేది లేకుండా పోయేది అని తాప్సి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.అనిల్ కపూర్ కుమారుడు, సోనమ్ కపూర్ సోదరుడైన హర్షవర్ధన్ కపూర్ 2016 లో రాకీష్ ఓంప్రకాష్ మెహ్రా యొక్క మిర్జ్యాతో తొలిసారిగా నటించాడు.అయితే ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూడడం తో రెండేళ్ల తరువాత భవేష్ జోషి సూపర్ హీరో అనే చిత్రంలోనూ నటించాడు.

అంతేకాకుండా ప్రస్తుతం అభినవ్ బింద్రా బయోపిక్ కోసం కూడా హర్ష వర్ధన్ పనిచేస్తున్న నేపథ్యంలో హర్ష వర్ధన్ టాపిక్ రావడం తో తాప్సి పై విధంగా స్పందించింది.తొలి చిత్రం ఘోర పరాభవం తర్వాత రెండో చిత్రం పొందడం చాలా కష్టం.నేను అతని స్థానంలో ఉండి ఉంటే, నాకు రెండవ చిత్రం లభించదు అని వ్యాఖ్యానించింది.

Advertisement

ఇప్పుడు తాప్సి వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.

Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest
Advertisement

తాజా వార్తలు