తెలుగు సినిమాలకి ప్రాధాన్యత ఉంటుంది... కానీ కండిషన్ అంటున్న తాప్సి

సౌత్ లో గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి తాప్సి పొన్ను.

ఈ అమ్మడు తెలుగులో యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అందరితో జత కట్టింది.

అయితే ఆమె చేసిన సినిమాలలో ఎక్కువగా గ్లామర్ పాత్రలకి మాత్రమే పరిమితం అయ్యింది.నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే సినిమాలు తెలుగులో పెద్దగా చేయలేకపోయింది.

ఒకటి, రెండు సినిమాలు చేసినా అవి అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తాప్సి టాలెంట్ ఎవరికీ తెలియకుండా పోయింది.దీంతో ఆమెని టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గానే దర్శక, నిర్మాతలు, ప్రేక్షకులు కూడా చూస్తూ వచ్చారు.

అయితే ఈ అమ్మడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.వరుసగా లేడీ ఒరియాంటెడ్ కథలతో సినిమాలు చేస్తూ హిట్ మీద హిట్ కొడుతుంది.

Advertisement

ఈ ఏడాది ఆరంభంలో తాప్సీ లీడ్ రోల్ లో వచ్చిన ఫ్యామిలీ స్టోరీ తప్పడ్ సినిమా మంచి హిట్ అవ్వడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.కొంత మంది ఈ సినిమాలో ఫిమేల్ సెంట్రిక్ గా ఉండే ఆడవాళ్ళ ఆత్మగౌరవం అనే ఎలిమెంట్ ని విమర్శించిన తాప్సి నటనకి మాత్రం అందరూ మంచి మార్కులు వేశారు.

నటిగా బాలీవుడ్ లో మరో మెట్టుపైకి ఈ సినిమా ఎక్కించింది.ఇదిలా ఉంటే సౌత్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిన హీరోయిన్స్ తరువాత కాలంలో తెలుగు సినిమాలని పూర్తిగా విష్మరించారు.

అలాగే తెలుగు సినిమా కల్చర్ మీద కూడా విమర్శలు చేశారు.అయితే ఈ విషయంలో తాను ప్రత్యేకం అని తాప్సి చెబుతుంది.

బాలీవుడ్ లోకి వెళ్ళినంత మాత్రాన తెలుగు సినిమాలు విడిచిపెట్టనని చెబుతుంది.అయితే ఒకప్పటిలా కేవలం షోకేస్ పాత్రలు అయితే చేసే ఉద్దేశ్యం లేదని, ఫిమేల్ సెంట్రిక్, లేదంటే హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న కథలు వస్తే మాత్రం కచ్చితంగా చేస్తానని తాప్సి ఓ మీడియా చానల్ కి ఇంటర్వ్యూలో పేర్కొంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest

తన ఈ గుర్తింపుకి తెలుగు సినిమా ఇండస్ట్రీ కారణం అనే విషయాన్ని ఎప్పటికి మరిచిపోనని కూడా చెప్పింది.

Advertisement

తాజా వార్తలు