అమెరికాలో భారత సంతతి బాలిక అదృశ్యం.. 18 రోజులైనా దొరకని జాడ, పోలీసుల గాలింపు చర్యలు

అమెరికాలో 14 ఏళ్ల భారత సంతతి బాలిక అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.దాదాపు 18 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ లభించ లేదు.

అర్కాన్సాస్ రాష్ట్రంలోని కాన్వేకు చెందిన తన్వి మరుపల్లి జనవరి 17న ఉదయం బస్సులో పాఠశాలకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు.దీనిపై తన్వి తండ్రి పవన్ రాయ్ మాట్లాడుతూ.

ప్రస్తుతం అమెరికాలో ‘‘లే ఆఫ్’’ల కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం వుందన్నారు.దీంతో తమ కుటుంబం అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.2022-23లో దాదాపు 3 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించారు.ఈ పరిణామాలు హెచ్ 1 బీ వీసాపై వున్న వారిని వణికిస్తున్నాయి.ఈ కేటగిరీ కింద వున్న వారు ఉద్యోగం కోల్పోతే.60 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని పొందాలి.లేనిపక్షంలో వారు అమెరికాను వదిలి వెళ్లాల్సి వుంటుంది.

తన్వి కనిపించకుండా పోయినప్పుడు పొట్టి జుట్టు, కళ్లద్దాలు పెట్టుకుంది.అలాగే పర్పుల్ కలర్ వింటర్ జాకెట్, పింక్ పుల్ ఓవర్ ధరించింది.జనవరి 17న కాన్వే జూనియర్ హైస్కూల్‌‌లో బస్ పికప్ ఏరియా వైపు వెళ్తుండగా సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

Advertisement

బస్సు ఎక్కడానికి బదులు ఆమె డేవిస్ స్ట్రీట్‌లో ఉత్తరం వైపు నడవటం కనిపించింది.తన్వి ఆచూకీ తెలిపిన వారికి 5000 డాలర్ల నగదు బహుమతిని అందిస్తామని కాన్వే పోలీస్ డిపార్ట్‌మెంట్ (సీపీడీ) ప్రకటించింది.

తన్వికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా (501) 450-6120 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపింది.

అటు తన్వి కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.బాధితురాలు తన మొబైల్‌ను ఇంట్లోనే వదిలేసిందని .ఈ క్రమంలో ఆమె ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారిందని తన్వి తల్లి శ్రీదేవి తెలిపారు.వీరి కుటుంబ స్నేహితుల్లో ఒకరైన జెన్నీ వాలెస్ చురుగ్గా శోధనలు నిర్వహిస్తున్నారు.

ఫిబ్రవరి 1న తన్వి గురించి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ను నిర్వహించింది.సెర్చ్ ఆపరేషన్‌లకు సహకరించాలని ఆమె ప్రతి ఒక్కరినీ అభ్యర్ధించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

స్థానిక పోలీసులపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు.

Advertisement

తాజా వార్తలు