హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడా ? అందులో కేసీఆర్ పాత్ర ఏంటి ?

తెలంగాణాలో ఇప్పుడు చర్చంతాహరీష్ రావు చుట్టూనే జరుగుతోంది.టీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా హరీష్ ప్రాధాన్యం తగ్గుతూ రావడం, ఆయనకు సరైన రాజకీయ ప్రాధాన్యం కల్పించలేదు.

కనీసం పార్టీ పదవులు ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు.చివరికి రాత్రీ పగలు తేడా లేకుండా దగ్గరుండి మరీ పర్యవేక్షించి, ఇంత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోవడానికి కారణం అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఓపెనింగ్‌కూ ఆయన్ను పిలువలేదు.

ఇవన్నీ చూస్తుంటే పార్టీలో ఆయనను పొమ్మనకుండా పొగ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది.ఇదే సమయంలో ఆయనకు ప్రజల నుంచి విపరీతమైన సానుభూతి, అభిమానం లభిస్తోంది.

ఇప్పుడు హరీష్‌రావుకు టీఆర్ఎస్‌లో ఏ మాత్రం ప్రాధాన్యం దక్కే సూచనలు కనిపించకపోవడంతో ఆయన మరో రెండేళ్లలో సొంత పార్టీ పెడతారన్న ప్రచారం మొదలయ్యింది.హరీష్ రావు సొంత పార్టీ పెట్టబోతున్నారన్న అనుమానం కేసీఆర్ కు కూడా కలిగింది.

Advertisement

అందుకే కొద్ది రోజుల క్రితం ప్రాంతీయ పార్టీలు, ద్రవిడ పార్టీలు అంటూ పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు.ఆ సందర్భంగా తమిళనాడు రాజకీయాల గురించి కేసీఆర్ ప్రస్తావనకు తీసుకొచ్చారు.

తమిళనాడులో జాతీయ పార్టీలకు ఆదరణ లేదని, అక్కడ కేవలం ద్రవిడ పార్టీలను మాత్రమే ప్రజలు ఆదరిస్తారని అందుకే అక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు ద్రవిడ పార్టీలే ఉంటాయి అంటూ వ్యాఖ్యానించారు.తమిళనాడు ద్రవిడ పార్టీల్లా తెలంగాణలో తెలంగాణ వాద పార్టీలు మాత్రమే ఉండాలనేది కేసీఆర్ ఉద్దేశంగా కనిపించింది.

మొదటి తెలంగాణ వాద పార్టీ టీఆర్ఎస్‌ అయితే, రెండో తెలంగాణ వాద పార్టీ ఏదీ అనేది చాలా మందికి సందేహం కలిగింది.అయితే హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారన్నసమాచారంతోనే కేసీఆర్ ఇంత అకస్మాత్తుగా ఇటువంటి వ్యాఖ్యలు చేసారని పార్టీలో చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా మరో వాదన తెరమీదకు వస్తోంది.అసలు హరీష్ రావు పార్టీ పెట్టడం వెనుక కేసీఆర్ హస్తం ఉందని, ఆయనే కావాలని హరీష్ ను దూరం పెట్టి ప్రజల్లో సానుభూతి పెంచి కొత్త పార్టీకి మార్గం సుగం చేస్తున్నారనే వాదన కూడా బయలుదేరింది.ఇలా జరిగితే పోటీ అంటూ జరిగితే అది తమ కుటుంబం మధ్యనే ఉంటుందని, అధికారం కూడా తమ కుటుంబం చేతుల్లోనే ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా పార్టీలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఇప్పటికే రెండు జాతీయ పార్టీల నుంచి హరీష్ రావు కు ఆహ్వానాలు అందుతుండడంతో ఆయన సొంత పార్టీ పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఇతర జాతీయ పార్టీల్లో చేరవద్దు అనే సంకేతాన్నికేసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ద్వారా పంపినట్టుగా అర్ధం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు