తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లలో రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ ని మనం ఇప్పటివరకు చూడలేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే.
ఇక ఇప్పుడు ఈయన డైరెక్షన్ లో మహేష్ బాబు( Mahesh Babu ) హీరో గా వస్తున్న సినిమాతో మరోసారి ఇండియాలోనే కాకుండా, హాలీవుడ్ రేంజ్ లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు అడ్వెంచర్లు కూడా చేయబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.
ఇక అందుకోసమే ఇంతకు ముందు రాజమౌళి తీసిన అన్ని సినిమాల కంటే ఇది డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.అలాగే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కొత్తగా తీర్చి దిద్దుతున్నట్టు గా కూడా సమాచారం అయితే అందుతుంది.ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విక్రమ్( Vikram ) కూడా ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.అయితే ఆయన ఈ సినిమాలో పోషించేది విలన్ పాత్రనా, లేదంటే హీరోకి హెల్ప్ చేసే పాత్రనా అనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ ఆయన మాత్రం
ఈ సినిమాలో తప్పకుండా ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నట్టుగా సమాచారం అనేది బయటికి లీక్ అయింది.ఇక ఈ సినిమాలో విక్రమ్ కనక చేసినట్లయితే ఆయన నటనతో విశ్వరూపం చూపిస్తాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక రాజమౌళి సినిమాల్లో నటులు తనదైన రీతిలో రెచ్చిపోయి నటిస్తూ ఉంటారు.
ఇక దానికి తగ్గట్టుగానే విక్రమ్ అయితే వేరే సినిమాల్లోనే అద్భుతమైన నటన నీ కనబరుస్తాడు.ఇక రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే ఇంకా మరింత రెచ్చిపోయి నటించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి….