పొన్నియన్ సెల్వన్‌ ఎఫెక్ట్‌.. రాజమౌళిని అవమానిస్తున్న తమిళ మీడియా

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పై తమిళ మీడియా రెగ్యులర్ గా అక్కస్సు వెళ్లగకుతూనే ఉంది.వాళ్లు ఎప్పటికప్పుడు తమ హీరో లు బెస్ట్ తమ దర్శకులు నెంబర్ 1 అన్న పోకడ లతో కథనాలు అల్లడం మనం చూస్తూనే ఉన్నాం.

 Tamil Media Trolls On Tollywood Jakanna Rajamouli ,  Film News, Ponniyan Selvan,-TeluguStop.com

తాజాగా మణిరత్నం దర్శకత్వం లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన పోనియన్ సెల్వన్‌ పెద్ద గా ఆకట్టుకోలేక పోయింది.సినిమా కు సంబంధించిన వసూళ్లు ఏ రేంజ్ లో వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం.

తమిళ్‌ బాహుబలి అంటూ ప్రచారం చేసిన తమిళ మీడియా ఇప్పుడు వస్తున్న వసూళ్ల ను చూసి కనీసం బింబిసారని కూడా క్రాస్ చేయలేక పోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేయాల్సింది పోయి టాలీవుడ్ జక్కన రాజమౌళి మరో సారి విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం తమిళ మీడియా రాజమౌళి ని బాహుబలి తో పాటు ఆయన తెరకెక్కించిన పలు సినిమాల్లోని సన్నివేశాలు పొన్నియన్ సెల్వన్‌ కి సంబంధించి నవల సన్నివేశాలకు కాపీ అంటూ విమర్శలు చేస్తున్నారు.రాజమౌళి మా యొక్క చారిత్రాత్మక నేపథ్యమున్న నవలను కాపీ కొట్టి ఆయన సినిమా లో సన్నివేశాలను పెట్టుకున్నాడు అంటూ తమిళ మీడియా కొత్త పోకడతో వింత వాదన వినిపిస్తుంది.మా సన్నివేశాలు కాపీ చేయడం వల్ల సక్సెస్ అయ్యాడు అంటూ సిగ్గు లేకుండా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది.

తమ సినిమా ఫ్లాప్ ఒప్పుకోకుండా రాజమౌళి సినిమా కాపీ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేసిన తమిళ మీడియా విజ్ఞత కోల్పోయి ప్రవర్తిస్తుందంటూ తెలుగు సోషల్ మీడియా జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి ని తమిళ సినీ ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మధ్య కాలంలో క్రాస్ చేయడం కానీ ఆయనని అందుకోవడం కానీ చేయలేరు.

అలాంటి సత్తా ఉన్న రాజమౌళి ని చిల్లర విమర్శలు చేస్తూ తమిళ మీడియా చేస్తున్న అడ్డగోలు ప్రచారం ఏమాత్రం సరికాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube