ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ ని పెళ్లి చేసుకోవడం కోసం ఆ తమిళ్ హీరో ఏకంగా తన భార్యని కూడా....

తమిళంలో పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ తమిళ హీరో విష్ణు విశాల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

 ఈ మధ్యకాలంలో విష్ణు విశాల్ తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అవుతున్నాడు.

అయితే ఎప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా  ఉండే విష్ణు విశాల్ తాజాగా తన ప్రియురాలితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసినటువంటి కారణంగా మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.అయితే ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా విష్ణు విశాల్ తన ప్రియురాలయిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తుండగా తీసినటువంటి కొన్ని ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో విష్ణు విశాల్ మలయాళ దర్శకురాలు "రజనీ నటరాజ్" ని  2010వ సంవత్సరంలో తన కుటుంబ సభ్యుల కోరిక మేరకు పెళ్లి చేసుకున్నాడు.  కానీ పెళ్లయిన కొద్దికాలంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

దీంతో పరస్పర అంగీకారంతో 2018వ సంవత్సరంలో విడనుకులు తీసుకున్నారు.ఇందుకుగాను విష్ణు విశాల్ తన భార్యకి కోట్ల రూపాయలు ఇచ్చినట్లు  సమాచారం.

Advertisement

దీంతో కొందరు నెటిజన్లు అప్పటికే బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో విష్ణు విశాల్  ప్రేమలో పడటం వల్లే తన భార్యకు విడాకులు ఇచ్చాడని కామెంట్లు చేస్తున్నారు.కాగా ఇటీవలే గుత్తా జ్వాలతో విష్ణు విశాల్ నిశ్చితార్థం జరిగింది.

అందువల్లే ఈ మధ్య విష్ణు విశాల్ మరియు గుత్తా జ్వాలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న విష్ణు విశాల్ తమిళంలో తెరకెక్కిన "రాటసన్" చిత్రం ద్వారా బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కాడు.

 దీంతో ప్రస్తుతం మలయాళంలో "ఎఫ్ఐఆర్" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అంతేగాక విష్ణు విశాల్ తన తదుపరి చిత్ర కథల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

 దీంతో ప్రస్తుతం మలయాళం, తమిళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా నాలుగు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు