గత 30 సంవత్సరాలుగా కేవలం మంచానికి పరిమితమై ఎంతో నరకం అనుభవించినటువంటి తమిళ నటుడు బాబు( Babu ) సెప్టెంబర్ 19వ తేదీ మరణించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన మరణ వార్త తన తల్లిని ఎంతో భావోద్వేగానికి గురి చేసింది.నిత్యం తన కుమారుడిని తలుచుకుంటూ బాబోద్వేగమైనటువంటి బాబు తల్లి ప్రేమ కూడా అక్టోబర్ 11వ తేదీ మరణించడంతో ఈ విషయం కాస్త కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.30 సంవత్సరాల పాటు కన్న కొడుకు మంచానికి పరిమితం కావడంతో కన్న కొడుకుకు ఎన్నో సేవలు చేసినటువంటి ఆ తల్లి హృదయం కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయింది.

ఇలా బాబు మరణించిన మూడు వారాలకే తన తల్లి ప్రేమ( Prema ) కూడా మరణించడంతో వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం కారణంగానే తన జీవితమే తలకిందులుగా మారిపోయిందని చెప్పాలి.ఎన్ ఉయిర్ తోళన్ సినిమా ద్వారా ఈయన హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయనకు దాదాపు పది సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి.
ఇలా 10 సినిమాలకు కమిట్ అయినటువంటి బాబు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం డూప్ లేకుండా యాక్షన్ సన్ని వేషాలలో నటించారు.

ఇలా డూప్ లేకుండా యాక్షన్ సన్ని వేషాలలో నటిస్తున్నటువంటి సమయంలో ఈయన ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు పడ్డారు.దీంతో వెన్నెముకకు తీవ్రమైనటువంటి దెబ్బ తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.ఈయనకు చికిత్స చేసినప్పటికీ ఈయన నిటారుగా కూర్చోలేని పరిస్థితికి వెళ్లిపోయారు.
దీంతో గత 30 సంవత్సరాలుగా కేవలం మంచానికే పరిమితమైనటువంటి బాబు గత నెల 19వ తేదీ కన్నుమూశారు.ఇలా మంచానికే పరిమితమైనటువంటి కొడుకుకి ఎన్నో సేవలు చేసినటువంటి ప్రేమ హృదయం ఒక్కసారిగా మొక్కలైంది.
ఇలా కొడుకు మరణ వార్తను జీర్ణించుకోలేనటువంటి ఈమె తరచూ తన కొడుకుని కలవరిస్తూ ఉండేది దీంతో ఈమె కూడా ఆ బాధను దిగమింగుకోలేక అక్టోబర్ 11వ తేదీ మరణించింది.







