పవన్ దగ్గరికి మళ్ళి వచ్చిన తమిళ దర్శకుడు

కెరీర్ మొదటి నుంచి తెలుగు దర్శకుల కంటే తమిళ దర్శకులకే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .తొలిప్రేమ లాంటి సూపర్ సక్సెస్ ఇచ్చింది తమిళ డైరెక్టర్ కరుణాకరన్ కావడం వల్ల ఏమో పవన్ కి తమిళ దర్శకులంటే మక్కువ కలిగింది.

 Tamil Director Approached Pawan Kalyan-TeluguStop.com

మరో తమిళ డైరెక్టర్ ఎస్.జే.సూర్య ఖుషి లాంటి బ్లాక్బస్టర్ ఇవ్వడం వల్ల ఇది మరింత బలపడింది.కేవలం దర్శకుల వరకే కాకుండా, పవన్ రిమేక్ చేసిన సినిమాలు ఎక్కువ తమిళ చిత్రాలే కావడం విశేషం.

అన్ని సక్సెస్ అవుతున్నాయని, తమిళ జనాల్ని నెత్తిన పెట్టుకొని కూర్చున్నాడు పవర్ స్టార్ .వరుస ఫ్లాపుల్లో కుడా, తమిళ రిమేక్ లు, తమిళ దర్శకులని వదలలేదు.బాలు,బంగారం,పులి,పంజా ఇన్ని అపజయాలు ఎదురయ్యాక తెలుగు దర్శకులు గుర్తొచ్చారు పవన్ కి.

తాజా వార్త ఏంటంటే .పవన్ కి పంజా లాంటి ఫ్లాప్ సినిమానిచ్చిన తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఓ వారం క్రితం పవన్ కి ఓ కథ వినిపించాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.అయితే ఈ కథ ఇంకా ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్ .అలా అని చెప్పి రిజెక్ట్ కుడా చేయలేదు.తన కెరీర్లోనే అత్యుత్తమ దశలో ఉన్న పవన్ మళ్ళి తమిళ దర్శకులతో సావాసం చేస్తాడా లేదా అనేది ఆసక్తికరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube