‘శ్రీమంతుడు’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు కొరటాల శివ.ఈయన తర్వాత సినిమా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతూ వస్తోంది.
మధ్య మధ్యలో అల్లు అర్జున్‌తో కూడా ఈయన సినిమా చేస్తాడనే పుకార్లు వినిపిస్తున్నాయి.ఇటీవలే మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
అయితే దర్శకుడు కొరటాల శివ అంటూ మాత్రం ప్రకటించలేదు.దాంతో అప్పటి నుండి కూడా పలు రకాల ప్రచారం జరుగుతూ వస్తోంది.
తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కొరటాల శివ తన తర్వాత సినిమాను రవితేజ హీరోగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవలే కొరటాల శివ ఒక మాస్ యాక్షన్ కథాంశంను రవితేజకు వినిపించాడు అని, వెంటనే రవితేజ ఓకే చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం నటిస్తున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రం పూర్తి కాగానే నవంబర్‌లో కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు రవితేజ ఒప్పుకున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో నిజం ఉండి ఉండదు అంటూ నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు.
ఎన్టీఆర్‌తో కొరటాల శివ తర్వాత సినిమా ఉంటుందని తాము భావిస్తున్నట్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు సన్నిహితులు అంటున్నారు.ఏ హీరోను కొరటాల తర్వాత శ్రీమంతుడుగా మారుస్తాడో చూడాలి.







