రెగ్యులర్ పాత్రలకి దూరం కావాలనుకుంటున్న తమన్నా

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న అందాల భామలతో తమన్నా భాటియా ఒకరు.

ఈ అమ్మడు తెలుగులో శ్రీ అనే సినిమాలో మంచు మనోజ్ కి జోడీగా నటించింది.

తరువాత హ్యాపీడేస్ తో అమ్మడుకి బ్రేక్ వచ్చింది.అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తెలుగు, తమిళ్ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.

ఒక్క ఏడాది కూడా గ్యాప్ లేకుండా అప్రతిహితంగా తన సినీ కెరియర్ ని కొనసాగిస్తూ వస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా తమన్నా ఉంది.

ప్రస్తుతం తమన్నా తన సినిమాలకి తానే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది.తెలుగులో ప్రస్తుతం గోపీచంద్ కి జోడీగా సిటీమార్ సినిమా షూటింగ్ లో ఉంది.

Advertisement

వచ్చే ఏడాది కొత్తగా ఎఫ్3 సెట్స్ పైకి వెళ్లనుంది.దీంతో పాటు అంధాదున్ రీమేక్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తమన్నా కనిపించబోతుంది.

అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ కూడా చేసింది.

కెరియర్ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న తమన్నా ఇకపై తన సినిమా సెలక్షన్ పద్ధతిని మార్చుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది.రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలకి దూరంగా వచ్చేసి కంటెంట్ బేస్ కథలతో పాటు కొత్తదనం ఉన్న ప్రత్యేక పాత్రలు కూడా చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పింది.సైరా సినిమా తరహాలో ఇంటెన్సిటీ ఉన్న పాత్రలు దొరికితే హీరో ఎవరనేది పట్టించుకోకుండా సినిమా చేస్తానాని చెప్పింది.

నటిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు సినిమాతో పాటు డిజిటల్ ఓటీటీ చానల్స్ కూడా అవకాశం ఉందని.అందుకే ఇకపై కొత్తదనం ఉన్న పాత్రలు నటిగా సంతృప్తినిచ్చే పాత్రలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు