తమన్నా (Tamannaah ) ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలకు దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ చేతినిండా సినిమాలతో తన గ్లామర్ తో కుర్ర కారును ఫిదా చేస్తూ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతున్న సీనియర్ హీరోయిన్.
ఈమె సినిమాల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా హీరోయిన్స్ పాత్రలు తన్నుకు వస్తున్నాయి.ఇప్పటికే తమన్నా చేతిలో మలయాళం లో ఒకటి,తమిళంలో రెండు సినిమాలు,హిందీలో ఒక సినిమా ఉంది.సినిమాల విషయం పక్కన పెడితే తమన్నా గత కొన్ని రోజులుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.
కానీ ఈ మధ్యకాలంలో తమన్నా విజయ్ వర్మ ( Vijay Varma ) కు బ్రేకప్ చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దానికి ప్రధాన కారణం తమన్నా మాట్లాడిన మాటలే.
అలాగే మాల్దీవ్స్ ( Maldives ) వెకేషన్ పూర్తిచేసుకుని వస్తుండగా ఎయిర్ పోర్ట్ లో తమన్నా విజయ్ వర్మ వేర్వేరుగా వచ్చారు.అంతేకాకుండా విజయ్ వర్మకి సంబంధించిన ప్రశ్నలు అభిమానులు అడిగితే దానికి సమాధానం చెప్పకుండానే తమన్నా వెళ్లిపోయింది.
ఇక విజయ్ వర్మ అయితే తమన్నా తో బాగా ఎంజాయ్ చేశారా అని ఒక అభిమాని అడిగితే అతనిపై ఫైరైన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అలాగే ఈ మధ్యకాలంలో ఓ ఈవెంట్లో పాల్గొన్న తమన్నా ( Tamannaah Marriage) కి పెళ్లిపై ప్రశ్న ఎదురైతే అసలు ఈ ప్రశ్న గురించి నా పేరెంట్స్ కూడా అడగడం లేదు మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అని కోప్పడింది.అయితే ఇవన్నీ గమనిస్తూ ఉంటే తమన్నా కు విజయ్ వర్మ బోర్ కొట్టాడని, అందుకే విజయ్ వర్మ గురించి మాట్లాడడానికి తమన్నా కి అంతగా ఇష్టం లేదని,అలాగే ఒకప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు తమన్నా పై వినిపించాయి.
కానీ ఈ మధ్యకాలంలో తమన్నా ఏ ఈవెంట్లో మాట్లాడిన కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోనని, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, ఇంకొన్ని రోజులు పెళ్లికి టైం ఉంది అంటూ పెళ్లి విషయాన్ని దాటేస్తోంది.
దీంతో తమన్నా మాట్లాడే తీరు చూసిన చాలామంది నెటిజన్స్ ఇద్దరి మధ్య దూరం పెరిగింది కావచ్చు.త్వరలోనే విజయ్ వర్మ (Vijay Varma Tamannaah Breakup) కు తమన్నా బ్రేకప్ చెప్పబోతుంది అని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.