టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న( Thamannah ).ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈమె రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్( Jailer )సినిమాలో కీలకపాత్రలో నటించారు.ఈ సినిమా ఆగస్టు పదవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇలా ఈ సినిమా సక్సెస్ కావడంతో తమన్నా పాల్గొని ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు.తాను చిన్నప్పటినుంచి రజనీకాంత్ గారికిపెద్ద అభిమానిని తెలిపారు.
ఆయనతో కలిసి ఒక ఫోటో దిగితే చాలు అనుకునేదాన్ని అయితే ఆయనతో ఫోటో దిగాలని నా కల నెరవేరుతుందా లేదా అని అనుమానం కూడా తనలో ఉండేదని తెలిపారు.
ఇలా రజనీకాంత్( Rajinikanth ) గారితో కలిసి ఒక ఫోటో దిగితే చాలు అనుకునే నాకు ఏకంగా ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది.ఇది నిజంగా అదృష్టం అంటూ ఈమె సంతోషం వ్యక్తం చేశారు.తనకు ఈ అవకాశం కల్పించినటువంటి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.అదేవిధంగా తమన్నా తన కెరీర్ గురించి మాట్లాడుతూ తన కెరియర్ పట్ల కొన్నిసార్లు తాను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల నేను ఇప్పటికీ బాధపడుతూనే ఉంటానని ఈమె తెలియజేశారు.
ముఖ్యంగా నా కెరియర్ లో నేను మిస్టర్ పర్ఫెక్ట్( Mr.Perfect ) సినిమా వదులుకొని పెద్ద తప్పు చేశానని తెలియజేశారు.ఈ సినిమా అవకాశం ముందుగా తనకే వచ్చిందని ఈమె తెలిపారు.
అయితే అప్పటికే తన చేతినిండా సినిమా అవకాశాలు ఉన్న నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలో ఈ సినిమాని వదులుకున్నానని తమన్నా తెలిపారు.ఈ సినిమా విడుదలయి చూసిన తర్వాత చాలా బాధపడ్డానని ఏదో ఒక విధంగా ఈ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించిందని తమన్నా తెలియచేశారు.
ఈ సినిమా మిస్ చేసుకున్నందుకు తాను ఇప్పటికీ బాధపడుతూనే ఉంటానని తెలియజేశారు.మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా మిస్ చేసుకున్నానని చెప్పినటువంటి తమన్న ఇందులో కాజల్ పాత్ర మిస్ చేసుకున్నారా లేక తాప్సి పాత్రన అనే విషయాలను మాత్రం తెలియజేయలేదు.