టాలీవుడ్ సూపర్ స్టార్ గా నిలిచిన మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో సినిమాలలో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు.
ఈయన ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే ఈయన గతంలో కిడ్నాప్ అయ్యాడని ఫిలింనగర్ లో బాగా చర్చలు జరిగాయి.
ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం.
ఒకప్పటి తెలుగు స్టార్ హీరో కృష్ణ కుమారుడు మహేష్ బాబు.తండ్రి హోదాతో సినీ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయం అయ్యాడు.1979 లో నీడ సినిమాతో బాలనటుడిగా పరిచయమయ్యాడు.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో దాదాపు 8 సినిమాలలో బాల నటుడిగానే నటించాడు.ఆ తర్వాత కొంతకాలానికి గ్యాప్ తీసుకొని 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
ఈ సినిమా తనకు మంచి సక్సెస్ను ఇవ్వడంతో ఏడాదికి వరుస సినిమాలతో బాగా బిజీగా మారాడు.కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ గా కూడా చేశాడు.
ఇక పలు సినిమాలలో తన నటనకు పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు.ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా ఉన్నాడు.
ఇక ఈయన మరో సినీనటి నమ్రతా శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఆమెతో ఓ సినిమాలో నటించగా వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇక వీరికి గౌతమ్ కృష్ణ, సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.మహేష్ బాబు భార్య నమ్రత తన పిల్లలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది.మహేష్ బాబు ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.ఇదిలా ఉంటే గతంలో మహేష్ బాబును కిడ్నాప్ చేశారు అంటూ చాలా చర్చలు జరిగాయి.
అదేంటి అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి కూడా అతడిని ఎలా కిడ్నాప్ చేశారు అనుకుంటున్నారా.
మహేష్ బాబు బుల్లితెరపై కూడా పలు వాణిజ్య ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.
కొన్నేళ్ల కిందట మరో ప్రకటన నవరతన్ ఆయిల్ షూటింగ్ కోసం మలేషియాకు వెళ్లాడట.ఆ సమయంలో మహేష్ బాబును దావూద్ ఇబ్రహీం మనుషులు అపహరించుకొని మరి తీసుకువెళ్లారని వార్తలు వినిపించాయి.
ఇక ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ అక్కడున్న వాళ్ళు మహేష్ సన్నిహితులకు ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచాఫ్ ఉందట.

ఇక దావూద్ ఇబ్రహీం మనుషులు మహేష్ బాబునే కిడ్నాప్ చేయడానికి కారణం ఆయన భార్య నమ్రత అని తెలిసింది.గతంలో మహేష్, నమ్రత ల మధ్య బాగా గొడవలు జరిగాయట.నిజానికి నమ్రతనే మహేష్ తో పదేపదే గొడవపడేదట.
ఇక ఈ విషయాన్ని నమ్రత చెల్లెలు శిల్పా శిరోద్కర్ దృష్టిలో పెట్టుకొని కిడ్నాప్ డ్రామా చేసినట్లు తెలిసింది.శిల్పా కి దావుద్ కు మధ్య దగ్గర సంబంధం ఉందని దాంతో తన బావ మహేష్ బాబుని కావాలనే కిడ్నాప్ చేయించిందని అప్పట్లో ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారింది.
ఆ తర్వాత నుంచి మహేష్ బాబు, నమ్రత ల మధ్య ఎటువంటి గొడవలు లేవని అన్యోన్యంగా ఉంటున్నారని తెలిసింది.ఇక ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా ఉందని తెలుస్తుంది.అంతేకాకుండా రాజమౌళి కూడా మహేష్ కోసం ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గతంలో వార్తలు వినిపించాయి.