జర్నలిస్టులపై తాలిబాన్ల దాష్టీకం ఆఫ్గానిస్థాన్ లో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది.మీడియా పనిపై నూతన ఆంక్షలు విధిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది.
తాలిబన్ల దాడులు కు స్వస్తి పలకాలని ఆంక్షలు విరమించుకోవాలని పాత్రికేయులపై అఘాయిత్యాలకు పాల్పడిన తాలిబాన్లకు తగిన శిక్ష పడాలని జర్నలిస్టుల సంఘం డిమాండ్ చేసింది.వివరాల్లోకి వెళితే.
కాబూల్ పశ్చిమ ప్రాంతంలో కార్ట -ఈ చార్ ప్రాంతంలో మహిళలు, బాలికలు హక్కులను కాపాడాలని బుధవారం మహిళలు నిరసన ప్రదర్శనలను జర్నలిస్టులు ప్రసారం చేయడంతో వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.ఇద్దరు జర్నలిస్టులకు ఎత్తుకుపోయారు.
కాబూల్ లోని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి వేరే వేరు సెల్ లో ఉంచి కేబుల్స్ తో బట్టలు విప్పి రక్తం వచ్చేలా చావబాదారు.

తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలు ఎందుకు కవర్ చేశారని జర్నలిస్టులను ఎగతాళి చేస్తూ కొన్ని గంటల పాటు చిత్రహింసలకు గురి చేశారు.వీరు వెనుక, ముఖాలకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.దీనితో ప్రజలు తాలిబన్ల అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్గాన్ మీడియా సంస్థ ఎట్లియాట్రోజ్ కు చెందిన ఎడిటర్ తిండి దర్యాబీ, రిపోర్టర్ నక్డీలను తాలిబన్లు బంధించి చిత్రహింసలకు గురిచేశారు.వారి పట్ల అమానుషంగా ప్రవర్తించి చావబాదినట్లు మీడియా సంస్థ వెల్లడించింది.
ఆ తర్వాత కొంత సేపటికి వీరిని విడిచిపెట్టినట్లు పేర్కొంది.తీవ్రమైన గాయాలతో ఉన్న జర్నలిస్టుల ఫోటోలను ఆ సమస్త నివేదిక విడుదల చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నక్డీ మాట్లాడుతూ.ఒక తాలిబన్ తలపై కాలు పెట్టి నలిపేసాడు.
ముఖాన్ని చిదిమేశాడని పేర్కొన్నాడు.అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించింది.
మీడియా సంస్థలను నిషేధించడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.