రేవంత్ రెడ్డి తెలుగు దేశం వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళాడు.కాంగ్రెస్ లో ఎదో పట్టం కట్టేశారు అనుకుంటే పట్టం కాదు కదా కనీసం పక్కన నుంచోడానికి కూడా ఎవరు రావడం లేదు.
పాపం ఒంటరిగానే నెట్టుకొస్తున్నాడు.రేవంత్ కేటిఆర్ ని టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతున్న మాటలకి టీఆర్ఎస్ నేతలు కూడా చాలా స్ట్రాంగ్ గా సమాధానాలు ఇస్తున్నారు
డ్రగ్స్ కేసులో నీ బావమరిది కి సంభందం ఉంది అన్నప్పుడు.
ఒక్కరోజులోనే తన బావ తో రేవంత్ కి నోటీసులు కూడా పంపించారు.ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణా మంత్రి రేవంత్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి
తెలంగాణా మత్స్య.
పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రేవంత్ రెడ్డి పై చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం పంచాక్షరి ఫంక్షన్ హాల్‌లో గొల్లకురుమ యాదవులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.”గింతలేడు బుడ్డొడు… అంతగా మాట్లాడుతున్నడు…ఇంతున్న నేనేంత మాట్లాడాలే.
మెడపట్టి పిసికితే పుసుక్కుమంటవ్ నా కొడక’ అంటూ తీవ్రమైన పదజాలంతో మాట్లాడారు
కొడంగల్ ప్రజలకోసం నువ్వు ఏమి చేశావో ముందు చెప్పు.లేదంటే నేను చెప్తా విను.
నిన్ను నమ్మి నీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు సిగ్గు పడేలా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకి పోయావ్.అంతేకాదు.
కాంగ్రెస్ లో పెద్ద పెద్ద పదవులు ఆశించి కాంగ్రెస్ లోకి వెళ్ళావ్.ఇప్పుడు నిన్ను వాళ్ళు తురుపు ముక్కలా చూస్తున్నారు.
ఇక నువ్వు కేవలం హైదరాబాద్ కి పరిమితం అవుతావు.కొడంగల్ ప్రజలకి నీ అవసరం లేదు అంటూ కామెంట్స్ చేశారు.
గొల్లకురుముల ఇరిగేషన్ కి.ఫించెన్లు నీ జోబులోనుంచీ తీసి ఇచ్చావా అంటూ ఎద్దేవా చేశారు.నీకు కొడంగల్ లో పరాభవం తప్పదని తెలిపారు.