ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్స్ చేసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

వేసవికాలం పిల్లలకు సెలవులు కావడంతో కుటుంబంతో కలిసి సరదాగా టూర్లకు వెళ్లాలని అందరూ ప్లాన్ చేసుకుంటారని మనందరికీ తెలిసిందే.అందుకోసం ఎక్కువగా ఆన్ లైన్ లో టికెట్లు ( Online Tickets ) బుక్ చేయడం, ఆన్ లైన్ లో హోటల్స్ బుక్ చేయడం చేస్తారు.

 Take These Precautions While Booking Online Tickets Details,  Precautions ,booki-TeluguStop.com

కానీ సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ లో బుక్ చేసే వాళ్లను టార్గెట్ చేసి సులభంగా దోచుకుంటున్నారు.కాబట్టి ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసేటప్పుడు కొన్ని ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు ప్రత్యక్షం అవుతాయి.

వీటి పట్ల అత్యాశపడితే బ్యాంకు ఖాతా దివాలా తీస్తుంది.చాలామంది ఆన్ లైన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు భారీ డిస్కౌంట్లు, భారీ ఆఫర్ల గాలానికి చిక్కి నష్టపోతున్నట్లు ఓ ట్రావెల్ సంస్థ రిపోర్ట్ చేసింది.

డబ్బును ఆదా చేసే ప్రయత్నంలో ఆన్లైన్ మోసాల బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుందని ఈ రిపోర్ట్ తెలిపింది.

కాబట్టి ఈ టిప్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటే మంచిది.

పేమెంట్ చేసే విధానం: ఆన్ లైన్ లో ట్రావెల్, హోటల్ రూమ్ ఎంచుకున్న తర్వాత పేమెంట్ చెల్లించేటప్పుడు ఆ సంస్థ రిఫండ్ విధానాలను ఒకసారి తనిఖీ చేయాలి.తర్వాత ఆ సంస్థ కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడాలి.

ఏదైనా వెబ్సైట్ లింక్ ద్వారా సెర్చింగ్ చేస్తున్నప్పుడు అనుమానం వస్తే వెంటనే లావాదేవీలు ఆపేసి, మళ్లీ సమీక్షించుకోవడం ఉత్తమం.ముఖ్యంగా ఫేక్ వెబ్సైట్ల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలి.

Telugu Hotels, Tickets, Cyber Crimes, Public Wifi-Latest News - Telugu

పబ్లిక్ వైఫై:

టూర్ వెళ్ళాక అక్కడక్కడ ఉచితంగా లభించే వైఫై ను ( Public Wi-Fi ) ఉపయోగించడం సరికాదు.ఎందుకంటే ఉచిత వైఫై ద్వారా హ్యాకింగ్, వైరస్ దాడుల ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రియాలిటీ చెక్:

హోటల్ రూమ్ బుక్ చేసే ముందు, ఆ హోటల్ రివ్యూలు ఒకసారి చెక్ చేయడం మంచిది.అక్కడ ఏమైనా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటే వారితో ఫోన్ చేసి మాట్లాడడం ఉత్తమం.

Telugu Hotels, Tickets, Cyber Crimes, Public Wifi-Latest News - Telugu

ఆఫర్ల దృష్ట్యా జాగ్రత్తలు: ఆన్ లైన్ లో ప్రయాణాలకు సంబంధించి, హోటల్ రూమ్ బుకింగ్ గురించి సర్చింగ్ చేస్తున్నప్పుడు భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ వంటివి కనిపిస్తే ముందుగా వాటిని పూర్తిగా తనిఖీ చేయాలి.ఆకర్షణీయ ఆఫర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి.సైబర్ నేరగాళ్లు( Cyber Fraudsters ) ఈ విషయాలపై దృష్టి పెట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మోసం చేయడానికి అన్ని దారులను తెరిచి ఉంచారు.అత్యాశకు పోకుండా ఒకటికి రెండుసార్లు చేక్ చేసుకోని ఆన్ లైన్ లో ఏదైనా బుక్ చేసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube