కూలి నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనా సీనియర్ నటి ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.వెంకటేష్ సరసన రొమాన్స్ చేసిన టబు అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ కి ఎగిరిపోయి అక్కడ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది.
అయితే చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగు సినిమాలు చేస్తోంది.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే.ఇటీవల మొదలైన షెడ్యూల్ లో కూడా ఆమె చిత్ర యూనిట్ తో కలిసింది.అయితే రానా విరాటపర్వం సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకున్న టబు సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు డ్రాప్ అవుతున్నట్లు చెప్పేసింది.
డేట్స్ కుదరకపోవడం వల్లే టబు విరాటపర్వం షూటింగ్ లో పాల్గొనలేనని చెప్పిందట.

ఇటీవల దే దే ప్యార్ సినిమాతో సక్సెస్ అందుకోగానే బాలీవుడ్ అమ్మడికి డిమాండ్ పెరిగింది.వరుసగా ఆఫర్స్ వస్తుండడంతో మరోసారి తెలుగులో వస్తోన్న ఆఫర్స్ ని వదులుకుంటున్నట్లు టాక్.ఇక విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి డిఫరెంట్ పాత్రలో కనిపించనుంది.
టబు నో చెప్పగానే దర్శకుడు వేణు అడుగుల నందిత దాస్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం.







