అమ్మాయిలని అలా ప్రశ్నించే రైట్స్ మగాళ్ళక్కి లేవంటున్న తాప్సీ

ఈ జెనరేషన్ అమ్మాయిలు ఎక్కువగా ఇండిపెండెంట్ ఐడియాలజీతో పెరుగుతున్నారు.సమాజం, కట్టుబాట్లు, సంప్రదాయాలు అని మడుకట్టుకొని కూర్చోకుండా తాము ఏది చేయాలని అనుకుంటే అదే చేస్తున్నారు.

అలాగే తమ మనసులో ఎలా రియాక్ట్ అవ్వాలని అనిపిస్తే అలాగే రియాక్ట్ అవుతున్నారు.ఆడే మాటల నుంచి వేసుకునే డ్రెస్సుల వరకు ప్రతిదాంట్లో తమ వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

శారీల కంటే తమకు కంఫర్ట్ ఇచ్చే క్యాజువల్స్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.ఇలాంటి ఆలోచనలు అమ్మాయిలలో పెరగడానికి హీరోయిన్స్ కూడా ఒక కారణం అని చెప్పాలి.

సెలబ్రిటీలనే అమ్మాయిలు ఎక్కువగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు.సెలబ్రిటీల మాటలు, డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా సమాజంలో అమ్మాయిల మీద కూడా ప్రభావితం చేస్తుంది.

Advertisement

ఈ కారణంగానే అమ్మాయిలు చెడిపోవడానికి సినిమాలు కారణం అని కొంత మంది సొకాల్డ్ మగాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు.అలాగే సోషల్ మీడియాలో కూడా హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో అనే విషయాల మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు.

అలాంటి వారికి సెలబ్రిటీలు కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతారు.

ఇలాంటి విషయాలలో హీరోయిన్ తాప్సి ముందు వరుసలో ఉంటుంది.అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి ఎవరైనా క్వశ్చన్ చేసిన, విమర్శలు చేసిన వెంటనే వారికి కౌంటర్ ఇస్తుంది.ముఖ్యంగా ఆడవాళ్ళ బికినీ షూట్ గురించి గతంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్స్ కి క్లాస్ పీకింది.

మగాళ్ళు షర్ట్స్ తీసేసి సిక్స్ ప్యాక్ అంటూ తమ కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తే తప్పుకానిది, ఆడవాళ్ళు బికినీ వేస్తే ఎందుకు తప్పవుతుందని ప్రశ్నించింది.తాజాగా ఉత్తరాఖండ్ సీఎం రావత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

మహిళల వస్త్రధారణపై సీఎం అంతటివాడి కామెంట్ ని తాప్సీ ఖండించారు.బీచ్ ల్లో జిమ్ముల్లో చొక్కాలు విప్పుకుని ఫోటోలు షేర్ చేస్తే అది సెమీ న్యూడ్ కాదా? అంటూ తాప్సీ ప్రశ్నించారు.కేవలం నటీమణులనే ఎందుకని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆమె తిరిగి కౌంటర్ వేసింది.

Advertisement

స్త్రీ, పురుషులు సమానమని చెప్పే సమాజంలో స్త్రీ, పురుషులు ఒకే రకంగా ఎక్స్ పోజ్ చేస్తే అమ్మాయిలని మాత్రమే ఎందుకు తప్పుపడుతున్నారు అనేది తాప్సి అభిప్రాయంగా కనిపిస్తుంది.

తాజా వార్తలు