టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను( Taapsee Pannu ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది తాప్సీ.
కాగా ఈమె తెలుగులో దరువు, మొగుడు, మిషన్ ఇంపాజిబుల్, షాడో నీవెవరో,ఆనందో బ్రహ్మ, ఆడు కలం,వస్తాడు నా రాజు, ఝుమ్మంది నాదం, సాహసం లాంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలా ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.అయితే ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ తమిళం హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ దూసుకుపోతోంది.
అందులో భాగంగానే తాజాగా షారుక్ ఖాన్ హీరోగా నటించిన కి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియుడు మథియాస్ బో( Mathias Bo ) గురించి తొలిసారి తన మనసులోని మాటల్ని బయట పెట్టింది అగ్ర కథానాయిక తాప్సీ.
డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన మథియాస్ బోతో ఈ అమ్మడు గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉంది.

అయితే తన లవ్‌ఎఫైర్ పై ఈ భామ ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు.ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మథియాస్‌బో గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది తాప్సీ.
మథియాస్ పరిచయం కాకముందు నేను కొంతమంది అబ్బాయిలతో స్నేహం చేశాను.కానీ ఎవరి వ్యక్తిత్వం నన్ను ఆకట్టుకోలేదు.
పురుషుల్లో నిజాయితీతో పాటు జీవితం పట్ల పరిణతి ఉండాలని క్రమంగా తెలుసుకున్నా.ఈ లక్షణాలు మథియాస్ బోలో పుష్కలంగా ఉన్నాయి.
అతను నా జీవితానికి భద్రత కల్పించగలడని మా ప్రయాణంలో అర్థం చేసుకున్నా.గొప్ప వ్యక్తిత్వం కలిగిన అతనితోనే జీవితాన్ని పంచుకోవాలనే నిర్ణయానికొచ్చా అని తాప్సీ చెప్పుకొచ్చింది.
అయితే పెళ్లి వార్తలపై స్పందించడానికి ఈ భామ నిరాకరించింది.సమయం వచ్చినప్పుడు తానే ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది తాప్సీ.







