ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ భారత్ లో దిగ్విజయంగా జరుగుతోంది.భారతదేశ యువ ఆటగాళ్లు ఐపీఎల్ 17 సీజన్లో రెచ్చిపోతున్నారు.
వారికి ఇచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రతి టీం నువ్వా.
నేనా.అన్నట్లుగా చివరి బాల్ వరకు పోరాడి విజయాన్ని సొంతం చేసుకోవడానికి పోరాటం చేస్తున్నాయి.
ఇలా కొందరు ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ వేలంలో ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన వారి పర్ఫామెన్స్ మాత్రం పెద్దగా అగుపించట్లేదు.బేసిక్ ప్రైజ్ లో కొనుగోలు చేసి ఆటగాళ్లే ఈ ఐపీఎల్లో ఎక్కువగా పర్ఫార్మ్ చేస్తున్నారు.
ఇకపోతే ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే వారం రోజుల వ్యవధిలోనే టి20 ప్రపంచ కప్ 2024( T20 World Cup 2024 ) మొదలు కాబోతోంది.
జూన్ 1 నుంచి వెస్టిండీస్ అమెరికా దేశాల వేదికగా ఈ ప్రపంచ కప్ జరుగుతుంది.ఇక ఈ టి20 వరల్డ్ కప్ కోసం మే 1 లోపు అన్ని జట్ల టీమ్స్ ను ప్రకటించాల్సి ఉండగా.మే 1 లోపు అన్ని జట్ల టీమ్స్ ను ప్రకటించాల్సి ఉండగా టీమిండియాను( Team India ) బిసిసిఐ ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశం ఉంది.
ఇకపోతే టీమిండియా టి20 ప్రపంచ కప్ ప్రోమోకు( T20 World Cup Promo ) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఛానల్( Star Sports ) రిలీజ్ చేసింది.
ఇక ఈ వీడియోకు టి20 ప్రపంచ కప్ 2024 కు భారత్ సిద్ధమంటూ ప్రోమో మొదలుపెట్టింది.ఇక ఈ వీడియోలో.
విరాట్ కోహ్లీ( Virat Kohli ) బ్యాటింగ్, రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) బౌలింగ్, రోహిత్ శర్మ హిట్టింగ్, సూర్య కుమార్ యాదవ్ షాట్స్, అలాగే హార్దిక్ పాండే బౌలింగ్ లు వీడియోలో పొందుపరిచారు.ఇక చివరిలో కోహ్లీ సెల్యూట్ చేస్తున్న ఓ పిక్ కూడా అభిమానుల్లో జోష్ నింపింది.ముఖ్యంగా ఈ వీడియోలో బ్యాగ్రౌండ్ లో వచ్చే వందేమాతరం గీతం కూడా ప్రోమో వీడియోని మరింత ఆసక్తి రేపించింది.ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్క భారతీయుడికి గూస్ బంప్స్ రావడం పక్కా.
ఇక జరగబోయే ప్రపంచ కప్ లో మొత్తం 20 జట్లు పాల్గొనుండగా వాటిని నాలుగు గ్రూప్స్ గా విడదీసి పోటీలను జరపనున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఒకసారి చూసేయండి.