లోక్సభ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్( Congress ) కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కీలక సమావేశం నిర్వహించనుంది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై అభిప్రాయాలను కాంగ్రెస్ సేకరిస్తుంది.ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్షులు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో దీపాదాస్ మున్షీ( Deepadas Munshi ) సమావేశం కానున్నారు.
ఇందులో ప్రధానంగా లోక్ సభ అభ్యర్థుల ఎంపిక( Lok Sabha Candidates List )పై నేతలతో ఆమె చర్చించనున్నారు.కాగా ఏఐసీసీ ఆదేశాల మేరకు అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సమాచారం.