టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం మిషన్ ఇంపాజిబుల్.ఈ సినిమాకు స్వరూప్ ఆర్.ఎస్.జె వహించారు.నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానున్న సందర్భంగా తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో భాగంగా దర్శకుడు స్వరూప్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా స్వరూప్ మాట్లాడుతూ.ఈ మిషన్ ఇంపాజిబుల్ అనే కథను 2014 లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాశాను అని తెలిపారు.
దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని పేపర్ లో వచ్చిన ప్రకటనను చూసిన ముగ్గురు పాట్నాకు చెందిన పిల్లలు ముంబై కి వెళ్ళి పోతారు.
ఇదే వార్తను ఈ సినిమా కథగా రాసుకున్నాను అని చెప్పుకొచ్చాడు స్వరూప్.ఏజెంట్ సినిమా బాగా డెవలప్ అవడంతో ఈ సినిమాను ప్రారంభించానని, ప్రేక్షకులు నిజాయితీగా కథ చెబితే చూస్తారు అదే పూర్తి నమ్మకం నాకు ఉంది.
ఆ విషయం ఏజెంట్ సినిమాతో రుజువు అయ్యింది అని తెలిపారు.అయితే మొదట స్వరూప్ స్నేహితులు మొదటి సినిమా లవ్, కామెడీ చేయమని చెప్పగా, ఆ తరహాలో నిజాయితీగా చెబితే చూస్తారు అనే డిటెక్టివ్ సినిమా తీశాను అని చెప్పుకొచ్చాడు స్వరూప్.

అనంతరం హీరోయిన్ తాప్సీ గురించి మాట్లాడుతూ.తాప్సి తెలుగులో నటించి చాలా కాలం అయ్యింది.మొదట ఆమెకు కథ వినిపించగా క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ కథ నచ్చిడంతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పింది అని తెలిపారు స్వరూప్.తాప్సీ పన్ను ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అని ఆమె షూటింగ్ కు ఆరు గంటలకల్లా వచ్చేవారని, ముందు రోజే డైలాగులు తీసుకొని ప్రిపేర్ అయ్యేది అని చెప్పుకొచ్చారు.
సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.అయితే పిల్లల్లో ఒకరు దావూద్ ఫోటోను చూసి రామ్ గోపాల్ వర్మ అనుకుంటాడు, నేను కూడా చిన్నప్పుడు అదేవిధంగా అనుకునేవాడిని, నాతో పాటు ఎంతోమంది ఇలా అనుకున్నారు.
ఎందుకంటే దావూద్ కి, రామ్ గోపాల్ వర్మ కి దగ్గర పోలికలు ఉంటాయి అని చెప్పుకొచ్చాడు స్వరూప్.ఈ సినిమా షూటింగ్ ను మన నేటివిటీకి తగ్గట్టుగా హైదరాబాద్ చుట్టుపక్కల 8 గ్రామాలలో షూటింగ్ చేశాము అని తెలిపారు.