దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అన్ని భాషలలో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక గత కొద్దిరోజుల నుంచి ఈయన సినిమాల విషయంలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటూ బిజెపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా శనివారం ప్రకాష్ రాజ్ పుట్టినరోజు కావడంతో ఈయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఇక తన పుట్టినరోజు సందర్భంగా ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు.
మొక్కలు నాటిన అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుందని కొనియాడారు.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారని ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే దిశగా అందరిని ప్రోత్సహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు.రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రకాష్ రాజ్ అందరికీ పిలుపునిచ్చారు.







