స్వామీజీని తాపీమేస్త్రి చేసి బీసీ బంధు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:కులవృత్తిపై ఆధారపడి జీవించే వెనుకబడిన తరగతుల వారికి ఆర్ధిక చేయూతను ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన బీసీ బంధు పథకం స్థానిక బీఆర్ఎస్ నేతల జోక్యంతో పక్కదారి పడుతుందని అనేక ఆరోపణలు వస్తున్నాయి.నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) సంస్థాన్ నారాయణపూర్ మండలకేంద్రానికి శంకరానంద స్వామి అనే వ్యక్తిని తాపీమేస్త్రిగా చూపిస్తూ బీసీ బంధు మంజూరు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

 Swamiji Was Made A Mason By Bc Bandhu , Yadadri Bhuvanagiri , Bc Bandhu , Financ-TeluguStop.com

అన్నిటిని త్యజించి శివదీక్ష చేపట్టి భగవంతుడి సేవ చేస్తూ జీవిస్తున్న స్వామీజీకి మండల బీఆర్ఎస్ నేతలు బీసీ బంధుకు ( BC Bandhu )ఎంపిక చేసి ఔరా అనిపించారు.దీనితో అర్హులైన బీసీలను పక్కన పెట్టి,అవసరం లేనివారికి పథకాలు వర్తింపజేస్తున్న అధికార పార్టీ నాయకులపై అర్హులైన బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఉద్ధరించడానికే బీసీబంధు తెచ్చామని గొప్పలు చెబుతోందని,కానీ,క్షేత్ర స్థాయిలో పథకం పక్కదారి పడుతుందని మండిపడుతున్నారు.ఆర్ధిక ఇబ్బందులను( Financial difficulties ) ఎదురుకొంటూ కష్టపడి కుల వృత్తులు చేసుకుంటున్న వారిని వదిలేసి,ఏ వృత్తి చేయని స్వామీజీకి బీసీ బంధు అందజేయడంపై గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు అనర్హులకు మంజూరు చేసిన పథకాన్ని రద్దు చేసి,నిజమైన అర్హులకు బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube