ఈ ఊరికి మేమే బాసులమంటున్న వానరసైన్యం...!

నల్లగొండ జిల్లా:గుండ్లపల్లి మండలం గోనబోయినపల్లి గ్రామంలో కోతుల సంచారం చూస్తే గ్రామాన్ని వానర సైన్యం ఆక్రమించిందా అని అనిపిస్తుంది.

వేలాది వానర సైన్యం ఏకంగా గ్రామపంచాయతీ ఆఫిస్ లొనే తిష్టవేసి తామే గ్రామానికి పాలకులం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఊరిలో ఎక్కడ చూసినా కోతులే ఉండడంతో పిల్లలు,వృద్దులు,పెద్దవారు కూడా బయటికి వెళ్ళాలంటే భయంతో వణికిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏ క్షణం ఎటువైపు నుండి దాడి చేస్తాయోనని గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శి,మండల అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన లేదని,ఇప్పటికే కొంతమందిని కోతులు దాడి చేసి కరవడంతో హాస్పిటల్ పాలైన ఘటనలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కోతుల బెడదతో పిల్లలు స్కూల్ కి వెళ్లలేని పరిస్థితి ఉందని,ఇంట్లో వృద్దులపై దాడి చేసి నిత్యవసర సరుకులు ఎత్తుకెళుతున్నాయని, పొలాల దగ్గరికి వెళ్లే రైతులపై దాడి చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని,ప్రాణాలను అరిచేతుల పెట్టుకొని గడుపుతున్నామని అంటున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
గుర్రంపోడు మండలం మొసంగిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

Latest Nalgonda News