ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది.స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
అనుమానాస్పదంగా విచ్ఛలవిడిగా మృతదేహాలు పడి ఉండడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పోలీసులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.వనపర్తి జిల్లా రేపల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పదంగా మృతి చెంది ఇంట్లో విగత జీవులుగా పడిఉన్నారు.
కుటుంబానికి చెందిన అజీరాం బీ (63), ఆమె కూతురు ఆస్మాబేగం (35), అల్లడు ఖాజా పాషా (42), మనుమరాలు (10) ఇంట్లో వేర్వేరు చోట్లలో పడి ఉన్నారు.వంట గదిలో అజీరాం బీ, ఇంటి హోల్ లో ఆమె మనుమరాలు హసీనా, డైనింగ్ హాల్ లో ఆస్మాబేగం, ఇంటి వెనక పెరట్లో ఖాజా పాషా మృతదేహాలు లభ్యమయ్యాయి.
క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని, ఇంటి ఆవరణలో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పడి ఉన్నాయని తెలిపారు.కుటుంబ సభ్యులు అందరూ చనిపోవడంతో ఈ కేసు ఓ సవాల్ గా మారిందన్నారు.
వీరు ఆత్మహత్య చేసుకున్నారా ? లేకుంటే ఎవరైనా ప్లాన్ చేసి చంపారా ? అంటూ పలు అనుమానాలు వ్యక్తపరిచారు.ఈ మేరకు కేసు విచారణలో ఉందని త్వరలో కేసును చేధిస్తామని పోలీసులు తెలిపారు.