వావ్: టీవీ నే కంప్యూటర్ గా మార్చేసిన ఇంజనీరింగ్ స్టూడెంట్...!

ఎలాంటి విషయానైనా సాధించగలమన్న పట్టుదల ఉంటే సులువుగా వాటిని నెరవేర్చుకోవచ్చు.తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పాండ్య నాయక్ తాండ కు చెందిన ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి మౌనిక వారి ఇంట్లో టీవీని కంప్యూటర్ గా పూర్తిగా మార్చేసింది.

 Computer, Remote, Ethernet, Technnology, Tv, Remote-TeluguStop.com

ప్రస్తుతం మౌనిక బీటెక్ పూర్తి చేసి గేట్ క్వాలిఫై అవడం జరిగింది.ఇకపోతే మౌనిక తాను టీవీని కంప్యూటర్ గా ఎలా మార్చిందో అన్న వివరాలను పూర్తిగా తెలిపింది.

ఇందుకు సంబంధించి ఆర్జినెట్ అనే పరికరాన్ని ఉపయోగించి చేసినట్లు ఆమె తెలిపింది.

రిమోట్ లో ఒక బటన్ తో మనకు అవసరమైనప్పుడు కంప్యూటర్ నుండి టివి గా, అలాగే టీవీ నుండి కంప్యూటర్ గా సులువుగా మార్చుకోవచ్చని ఆవిడ తెలిపింది.

ఇదంతా కేవలం ఆర్జినెట్ అనే పరికరం ద్వారా చేసుకోవచ్చని తెలిపింది.ఇకపోతే ఈ పరికరం ద్వారా ఆఫీసు, ఏదైనా పెద్ద స్టేడియంలో, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ లో అనేకచోట్ల మానిటర్ ని ప్రొజెక్టర్ కు కనెక్ట్ చేసి వాడుకునే విధంగా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టం తో రూపొందించారు.ఇక ఈ పరికరంలో క్వాడ్-కోర్ 64 బిట్, 1.5 GHz స్పీడ్ ప్రాసెసర్ లాంటి కొన్ని వాటిని ఉపయోగించి ఈ విధానాన్ని పూర్తి చేయవచ్చు.

ఇకపోతే ప్రాసెసర్ ద్వారా మదర్ బోర్డు వేడిని తగ్గించడం కోసం ఫ్యాను ను కూడా అమర్చింది.అంతే కాకుండా ఇందులో కొన్ని యూఎస్బి పోర్ట్స్ ద్వారా ఎక్స్టర్నల్ పరికరాలను కూడా అమర్చుకోవచ్చు.

ఇక టీవీ కి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడం కోసం ఈథర్ నెట్ తోపాటు వైఫై సౌలభ్యం కూడా లభించనుంది.అయితే ఇందుకు సంబంధించి అవసరమైన పరికరాల అన్నిటినీ కలిపి కేవలం ఏడు వేలు మాత్రమే ఖర్చు జరిగిందని మౌనిక తెలిపింది.

ఇంకా ఇలాంటి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రముఖులు ప్రోత్సహిస్తే.పెద్ద ఎత్తున ఈ పరికరాలను తయారు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలకు సంబంధించి అవగాహన చేపట్టవచ్చని మౌనిక ఇందుకు తన వంతుగా కృషి చేస్తాను అన్నట్లు తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube