టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది.ఈ మేరకు పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలో సర్వీస్ రూల్స్ ను ఉల్లంఘించారన్న కారణంగా శ్రీనివాస్ పై సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది.ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో శ్రీనివాస్ అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులోనే శ్రీనివాస్ పై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే ఆయనను సస్పెండ్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.







