బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ఒకరు.ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ఇక ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే ఇలా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికాలోని స్థిరపడి హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ అక్కడే ఉండిపోయారు.

ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్( Singer Nick Jonas ) ను వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా హాలీవుడ్ కి పరిమితమయ్యారు.ఇకపోతే కెరియర్ మొదట్లో ప్రియాంక చోప్రా సినిమాలలో నటిస్తూ మరింత అందంగా కనిపించడం కోసం ముక్కుకి సర్జరీ చేయించుకున్నారట.ఇలా ఈమె ముక్కుకు సర్జరీ చేయించుకోవడంతో భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేయడమే కాకుండా సర్జరీ సక్సెస్ కాకపోవడంతో చాలా అందవిహీనంగా తయారయ్యాట.
ఇలా తన ఫేస్ తాను చూసుకొని ఎంతో కుమిలిపోతూ ఒకానొక సమయంలో ఈమె పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది.ఇలా ప్రియాంక చోప్రా సర్జరీ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది అంటూ అప్పట్లో పేపర్లో వార్త రావడంతో ఆ వార్త చూసినటువంటి ప్రముఖ డైరెక్టర్ అనిల్ శర్మ ( Anil Sharma ) ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారని తాజాగా వెల్లడించారు.

ప్రియాంక చోప్రా చాలా అందమైన నటి ఈమెకు ఇలా జరగడం ఏంటి అని వెంటనే తాను ఫోన్ చేశానని అలా ఫోన్ చేయగానే మరుసటి రోజు ప్రియాంక చోప్రా తన తల్లితో పాటు తన వద్దకు వచ్చిందని ఈయన వెల్లడించారు.ఇలా తన ముక్కు సర్జరీ( Priyanka Chopra Nose Surgery ) కారణంగా తాను ఎంత నష్టపోయానో అనే విషయాలను ఈమె వెల్లడించారు.ఇలా తాను సర్జరీ కారణంగా అందవిహీనంగా మారడంతో తనకు సినిమా అవకాశాలు కూడా రాలేదని కన్నీళ్లు పెట్టుకున్నారట.అయితే కొద్ది రోజులు తర్వాత అనిల్ శర్మ దర్శకత్వంలోనే ప్రియాంక చోప్రాకు ఒక మూవీ ఆఫర్ ఇచ్చారని, ఈ సినిమాలో నటించిన ఈమె తిరిగి సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించారని తెలిపారు.
ఇలా ప్రియాంక చోప్రా కెరియర్ ను తానే కాపాడానని డైరెక్టర్ అనిల్ శర్మ ఒకానొక సందర్భంలో చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







