కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సస్పెన్స్..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.

బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇవాళ మరోసారి విచారణ చేపట్టనుంది.

అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.మరోవైపు అవినాశ్ రెడ్డి పిటిషన్ లో వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో పిటిషనర్ల వాదనలను న్యాయస్థానం ఇవాళ విననుంది.అనంతరం తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు