తెలంగాణ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా బిఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణరావు ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి బిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ ఇద్దరు ఏ పార్టీలో చేరతారు.ఎటు వైపు అడుగులు వేస్తారు అనే ప్రశ్నలు గత ఆర్నెళ్లుగా అత్యంత ఆసక్తి రేకెత్తించాయి.
అయితే ఎట్టకేలకు జులై 2 న అధికారికంగా కాంగ్రెస్ లో చేరారు పొంగులేటి శ్రీనివాస్( Ponguleti Srinivasa Reddy ).ఇక పార్టీలో చేరిన కొద్ది రోజులకే ప్రచార కమిటీ కొ చైర్మెన్ గా కీలక బాధ్యతలు కూడా చేపట్టారు.

ఇప్పుడు అందరి దృష్టి జూపల్లి కృష్ణరావు( Jupally krishnarao )పై పడింది.అన్నీ అనుకున్నట్లు జరిగితే.ఈపాటికే జూపల్లి కృష్ణరావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సి ఉంది.కానీ అలా జరగలేదు.షెడ్యూల్ ప్రకారం కొల్లాపూర్ లో ఈ నెల 20న జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరాల్సి ఉంది.కానీ ఈ నెల 20న ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో జూపల్లి కృష్ణరావు చేరిక కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే నెక్స్ట్ ఎప్పుడు అధికారికంగా ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారనే దానిపై స్పష్టమైన సమాధానం లేదు.

అయితే ఆయన కాంగ్రెస్( Congress ) లో చేరిన తరువాత.హస్తం హైకమాండ్ జూపల్లికి ఎలాంటి ప్రదాన్యత ఇస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.పార్టీలో చేరగానే పొంగులేటికి ప్రచార కమిటీ కో చైర్మెన్ పదవి కట్టబెట్టింది.మరి పొంగులేటితో పాటు మొదటి నుంచి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్న జూపల్లికి ఆ స్థాయి హోదా కాంగ్రెస్ అధిష్టానం కట్టబెడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి.
పొంగులేటి తో పోల్చితే జూపల్లికి ఆ స్థాయి ప్రజాదరణ లేదనేది కొందరి మాట.అలాగే దూకుడైన రాజకీయాలు చేయడంలో జూపల్లి కొంత నెమ్మదిగా ఉంటారనే వాదన ఉంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిన తరువాత జూపల్లి పాత్ర ఎలా ఉండబోతుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.మరి కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయమే కాగా అధికారికంగా జూపల్లి కృష్ణరావు హస్తం గూటికి ఎప్పుడు చేరాతరో చూడాలి.