కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Hero Suriya ) లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కంగువ( Kanguva ).పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ అంతా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.సినిమాను త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్.ప్రమోషన్స్ ని కూడా భారీగా చేయాలని ప్లాన్ చేశారు.పాన్ ఇండియా లెవెల్ లో సూర్య కంగువ హంగామా ఉండబోతుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా విషయంలో సూర్య మరింత జాగ్రత్త వహిస్తున్నారట.
పాన్ ఇండియా రిలీజ్( Pan India Release ) అవుతున్న ప్రతి తెలుగు సినిమా ఎలాగైతే ప్రమోషన్స్ బాగా చేస్తుందో అలానే సూర్య కంగువ సినిమాను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.సూర్య కంగువ సినిమాను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్( UV Creations ) కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా సూర్య యుద్ధ వీరుడిగా కనిపించనున్నారు.బాహుబలి తర్వాత కోలీవుడ్ నుంచి పి.ఎస్ 1, 2 లు వచ్చినా పెద్దగా ప్రభావితం చూపించలేదు మరి సూర్య కంగువ అయినా వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి.కోలీవుడ్ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక సినిమాగా కంగువ వస్తుంది.
ఇది సూర్యకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.