చెన్నై వరద బాధితులకు అండగా నిలిచిన సూర్య బ్రదర్స్... 10 లక్షల ఆర్థిక సహాయం?

మిచౌంగ్‌ తుఫాను విధ్వంసం కారణంగా రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి.

 Surya And Karthi Announces 10 Laks Cm Relief Fund For Chennai Floods, Surya,kart-TeluguStop.com

తుఫాను కారణంగా భారీ స్థాయిలో వరదలు రావడంతో చెన్నై అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.దీంతో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఈ తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం పంట నష్టం జరిగిందని తెలుస్తుంది.అయితే ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు.

Telugu Chenni Flood, Cm, Karthi, Kollywood, Surya, Lakhs-Movie

ఇలా తుఫాను కారణంగా పెద్ద ఎత్తున వరదలు రావడంతో సినీ సెలబ్రిటీలు వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు .ఈ క్రమంలోనే తమిళనాడులో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి సూర్య ( Surya )అలాగే కార్తీ( Karthi ) వారి తరపున 10 లక్షల రూపాయలను తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించారు.అలాగే వరద బాధితులకు అండగా నిలవాలి అంటూ తమ అభిమానులకు కూడా పిలుపునిచ్చారు.ఇలా వరద బాధితులను ఆదుకోవడానికి సూర్య బ్రదర్స్ ముందుకు రావడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక వీరి బాటలోనే మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ముందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు.

Telugu Chenni Flood, Cm, Karthi, Kollywood, Surya, Lakhs-Movie

ఇలా ఏదైనా విపత్కర సంఘటనలు ఎదురైతే వారిని ఆదుకోవడానికి సినీ సెలెబ్రిటీలు ముందు వరుసలో ఉంటారనే విషయం మనకు తెలిసిందే.ఇక సూర్య బ్రదర్స్ గతంలో కూడా ఇలా చెన్నైలో వరదలు(Chennai Floods) రావడంతో అప్పుడు కూడా ఆర్థికంగా అండగా నిలిచారు ఇప్పుడు కూడా వీరు ఆర్థిక సహాయం చేయడంతో వీరి బాటలోనే మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని సూర్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సూర్య ఇప్పటికే ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమందికి మంచి భవిష్యత్తు కల్పిస్తూ ఎంతో మంది చిన్నారులకు అండగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube