భారీ యాక్షన్ విజువల్స్ తో 'కంగువ' గ్లింప్స్.. బర్త్ డే బ్లాస్ట్ అదిరిందిగా..

కోలీవుడ్ హీరోల్లో సూర్య( Suriya ) ఒకరు.ఈయనకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందొ చెప్పాల్సిన పని లేదు.

 Suriya Kanguva Official Glimpse Out Details, Kanguva Glimpse, Kanguva, Suriya, D-TeluguStop.com

ఇక ఈ రోజు సూర్య పుట్టినరోజు జరుపు కుంటున్నారు.ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుండి అదిరిపోయే బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో ”కంగువ” సినిమాను( Kanguva ) చేస్తున్నాడు.ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.

సూర్య జై భీమ్, విక్రమ్ వంటి సినిమాతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు.ఇక ఇప్పుడు ఈయన చేస్తున్న కంగువ మీద కూడా భారీ హైప్ పెరిగింది.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

సూర్య బర్త్ డే సందర్భంగా సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల 1 నిముషానికి కంగువ గ్లింప్స్( Kanguva Glimpse ) రిలీజ్ చేసారు.ఈ గ్లింప్స్ ఆడియెన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.సూర్య లుక్ అతడి ప్రెజెన్స్ అంతా కూడా ఆకట్టుకునేలా ఉంది.

ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత వెన్నులో వణుకుపుట్టేలా చేసింది.భారీ యాక్షన్ విజువల్స్ తో గ్రాండ్ గా ఈ సినిమా గ్లింప్స్ ఉంది.

ఇక ఈ గ్లింప్స్ సూర్య పుట్టిన రోజుకు( Suriya Birthday ) పెర్ఫెక్ట్ కానుక అనే చెప్పాలి.యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు టాక్.కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

https://youtu.be/oBlxdr1KbEA
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube