ప్రముఖ నటుడి కూతురిపై బాడీ షేమింగ్ ట్రోల్స్.. నా బరువు గురించి ఆందోళన వద్దంటూ?

Suresh Gopi Daughter Shocking Comments Goes Viral In Social Media Details Here , Bhagya , Viral, Suresh Gopi Daughter , Kollywood, Kerala , Social Media

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి.బాడీ షేమింగ్ కు సంబంధించిన ట్రోల్స్ వల్ల చాలామంది సెలబ్రిటీలు ఇబ్బందులు పడుతున్నారు.

 Suresh Gopi Daughter Shocking Comments Goes Viral In Social Media Details Here ,-TeluguStop.com

మలయాళీ నటుడు సురేశ్ గోపీ( Suresh Gopi ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సురేష్ గోపీ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

సురేశ్ గోపీ కూతురు భాగ్య( Bhagya ) తాజాగా గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.

అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా( Social media ) వేదికగా షేర్ చేయడం జరిగింది.

ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా ఒక నెటిజన్ ఆ ఫోటోల గురించి స్పందిస్తూ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఇకనుంచి మీరు చీరలను పక్కన పెట్టి వెస్ట్రన్ దుస్తులు ధరిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు.ప్రాబ్లం ఏంటంటే లావుగా ఉన్నవాళ్లకు చీరలు సెట్ కావని వెస్ట్రన్ దుస్తుల్లో మీరు చాలా స్మార్ట్ గా ఉంటారని నెటిజన్ కామెంట్ చేశారు.

ఆ కామెంట్లు తనను హర్ట్ చేయడంతో భాగ్య అసహనానికి గురి కావడంతో పాటు ఒకింత ఘాటుగా స్పందించారు.మీరిచ్చిన ఉచిత సలహాలకు ధన్యవాదాలు అని నా బరువు మీకు సంబంధించిన విషయం కాదని ఇందుకు సంబంధించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.నాకు నచ్చిన దుస్తులను నేను ధరిస్తానని భాగ్య చెప్పుకొచ్చారు.

గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన సమయంలో కేరళ సంస్కృ( Kerala )తి, సాంప్రదాయాలను గౌరవిస్తూ దుస్తులను నేను ధరించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.ఇతర భారతీయ విద్యార్థుల మాదిరిగా పాశ్చాత్య సంస్కృతికి నేను తలవంచనని ఆమె చెప్పుకొచ్చారు.ఇతరుల దుస్తులు, శరీరాకృతి గురించి కామెంట్లు చేయడానికి బదులుగా చేసే పనిపై దృష్టి పెడితే బాగుంటుందని ఆమె పేర్కొన్నారు.

సురేష్ గోపీ కూతురు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube