సుకుమార్ సినిమా అంటే ఒక్క సీన్లు అయినా హీరోయిన్స్ అలా ఉండాల్సిందేనా?

లెక్కలు మాస్టర్ గా కొనసాగుతూ అనంతరం సినిమాలపై ఆసక్తితో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి వారిలో దర్శకుడు సుకుమార్( Sukumar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దర్శకుడిగా ఈయన ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి సుకుమార్ ఇటీవల పుష్ప సినిమా( Pushpa ) ద్వారా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

పుష్ప సినిమాతో ఈయన క్రేజ్ మారిపోయిందని చెప్పాలి.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Surely Sukumar Should Have That In Every Movie Have You Noticed Details, Sukumar

ఇక ఈ సినిమా కూడా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఈ సినిమా తర్వాత సుకుమార్ తన తదుపరి చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కలిసి చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా సుకుమార్ సినిమాలకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

సుకుమార్ సినిమాలలో హీరోయిన్స్( Heroines ) ఎలాంటి పాత్రలలో నటించినప్పటికీ ఏదో ఒక సన్నివేశంలో మాత్రం హీరోయిన్లను చాలా పద్ధతిగా సాంప్రదాయ దుస్తులలో కనిపించేలా చేస్తూ ఉంటారు.హీరోయిన్స్ గ్లామర్ లుక్ లో కనిపించిన లేదా డీ గ్లామర్ లుక్ లో కనిపించిన ఓ సన్నివేశంలో మాత్రం చాలా ట్రెడిషనల్ గా చూపిస్తారని తెలుస్తోంది.

Surely Sukumar Should Have That In Every Movie Have You Noticed Details, Sukumar
Advertisement
Surely Sukumar Should Have That In Every Movie Have You Noticed Details, Sukumar

ఆయన దర్శకత్వం వహించినటువంటి సినిమాల విషయానికి వస్తే ఆర్య సినిమాలో( Arya ) హీరోయిన్ ని ఏకంగా లంగా వోణీలలోను అలాగే పెళ్లికూతురు గెటప్ లో చూపించారు ఇక ఆర్య 2 సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ సెకండ్ హాఫ్ మొత్తం లంగా ఓణీలతో కనిపిస్తూ ఉంటుంది.అలాగే పుష్ప సినిమాలో రష్మిక( Rashmika ) డి గ్లామర్ లుక్ లో కనిపించినప్పటికీ ట్రెడిషనల్ గానే కనిపించారు.ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన మరో సెన్సేషనల్ హిట్ రంగస్థలం సినిమాలో కూడా సమంత( Samantha ) నేచురల్ లుక్ లో కనిపించిన చాలా ట్రెడిషనల్ గా కనిపించారు.

ఇక నాగచైతన్య హీరోగా నటించిన 100% లవ్ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ లో తమన్నా లంగా వోణీలో చీరలలో కనిపిస్తూ ఉంటారు.ఇలా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో హీరోయిన్స్ ఎంత గ్లామర్ లుక్ లో కనిపించిన కూడా ఏదో ఒక సన్నివేశంలో వారిని చాలా ట్రెడిషనల్ గా చూపిస్తారని అదే సుకుమార్ స్టైల్ అంటూ ఈ వార్త వైరల్ గా మారింది.ఇక పుష్ప 2 సినిమాలో కూడా రష్మిక( Rashmika ) ట్రెడిషనల్ గానే చాలా రిచ్ లుక్ లో కనిపించబోతున్నారని ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది.

Advertisement

తాజా వార్తలు