బీచ్ లో అలా కనిపించిన సురేఖ వాణి... పెళ్లి చేసుకో అంటూ సలహా ఇస్తున్న నెటిజన్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.

 Surekha Vani Was Seen On The Beach Netizens Are Advising To Get Married, Surekha-TeluguStop.com

ఇలా సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం సురేఖవాణి తన కుమార్తె సుప్రీతతో కలిసి చేసే రచ్చ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.సురేఖ వాణి నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ బీచ్, పబ్ అంటూ ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు.

ఇకపోతే తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియాలో ఒక బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.ఇందులో ఆరెంజ్ కలర్ ట్రెండీ వేర్ ధరించిన ఈమె సాగర తీరాన ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలు పైన నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సురేఖ వాణి షేర్ చేసిన ఈ ఫోటోలపై ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.మీరు ఇంత అందంగా ఉండటం తప్పు వెంటనే మీరు మరో పెళ్లి చేసుకోండి అంటూ తనకు సలహా ఇచ్చారు.వయసు మనసు ఉన్నప్పుడు అడవికి కాచిన వెన్నెలలా చేసుకోకండి అంటూ సురేఖ వానికి ఒక నెటిజన్ సలహా ఇచ్చాడు.దీంతో సదరు నేటిజన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సురేఖ వాణి సురేష్ తేజ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే 2019వ సంవత్సరంలో తన భర్త అనారోగ్య సమస్యలతో మరణించడంతో అప్పటినుంచి ఈమె ఒంటరిగా ఉంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube