తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ( Surekha Vani ) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలను పూర్తిగా తగ్గించేస్తూ తన కుమార్తెతో కలిసి సోషల్ మీడియాలో భారీగా రచ్చ చేస్తున్నారు.
ఇలా సోషల్ మీడియాలో తన కూతురితో కలిసి తరచూ పార్టీలు చేసుకోవడం వెకేషన్స్ కి వెళ్లడం అలాగే రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈ తల్లి కూతుర్లిద్దరూ పోటీపడి మరి అందాలను ఆరబోస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇక ట్రెండింగ్ లో ఉన్నటువంటి పాటలకు వీరిద్దరూ రీల్స్ చేస్తూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి సమ్మోహనుడా అనే పాటకు భారీగా స్పందన లభిస్తుంది.ఈ క్రమంలోనే ఈ పాటకు ఎంతోమంది రీల్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) నేహా శెట్టి ( Nehashetty ) జంటగా నటిస్తున్న రూల్స్ రంజన్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ చిత్రం నుంచి విడుదలైన ఈ పాట వైరల్ అవుతుంది.
ఇక ఈ పాటకి సురేఖ వాణి, సుప్రీత( Supritha ) కూడా పోటీ పడి మరీ డాన్స్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
చీరకట్టులో సురేఖ వాణి, సుప్రీతా డ్యాన్స్ చేస్తున్న విధానం ఆకట్టుకుంటోంది.ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ప్రతి పాటకు కూడా వీరిద్దరూ డాన్స్ చేస్తూ అందరిని సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే సమ్మోహనుడా పాటకు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఎప్పుడు గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇక సుప్రీత ఇప్పటివరకు వెండితెరపై ఒక సినిమాలో కూడా సందడి చేయలేదు త్వరలోనే ఈమె వెండి తెరపై సందడి చేయబోతున్నారని తెలుస్తుంది.