బలవంతపు మత మార్పిడులపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.మోసపూరితమైన మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో పిటిషన్ పై భారత అటార్నీ జనరల్ సహాయాన్ని కోరింది.మత మార్పిడి అనేది రాజకీయ రంగు పులుముకోకూడని తీవ్రమైన సమస్య అని గమనించింది.
అదేవిధంగా ప్రలోభపెట్టి, బలవంతంగా, ఇతర మార్గాల ద్వారా మత మార్పిడులు జరుగుతున్నట్లయితే ఏం చేయాలి.? దిద్దుబాటు చర్యలు ఏమిటి.? అని కోర్టు అభిప్రాయపడింది.ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం మాత్రమే కాదన్న న్యాయస్థానం దీన్ని రాజకీయం చేయొద్దని సూచించింది.
ఈ క్రమంలో బెదిరింపులకు గురి చేసి, ఆర్థిక ప్రయోజనాల ఆశ చూపించి చేసే మత మార్పిడులను నియంత్రించడంపై లా కమిషన్ ఒక నివేదికను, బిల్లును రూపొందించేలా చూడాలని పిటిషనర్ కోరారు.కాగా దీనిపై ఫిబ్రవరి 7న తదుపరి విచారణ జరగనుంది.







