EWS Reservations: ఈడబ్ల్యూఎస్ కోటాను అంగీకరించం

కేవలం ఆర్థిక ప్రమాణాలపై ఆధారపడిన రిజర్వేషన్లను మేము అంగీకరించం.షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులలోని పేదలను ఆర్థికంగా బలహీన వర్గాల కోటాలో ఎందుకు తీసుకురావడం లేదు? కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారికి, సామాజికంగా వెనుకబాటుతనం లేని వారికి రిజర్వేషన్లు కల్పించడం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం.ఆదిపత్య కులాలు ఎంత జనాభా ధమాషాలో ఉన్నారో అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించడం మోసపూరితమైనది.మండల కమిషన్ నివేదిక ప్రకారం ఇందిరా సహానీ కేసులో బీసీలకు 53% రిజర్వేషన్లు ఇవ్వవలసి ఉండగా రాజ్యాంగంలో లేని 50 శాతం రిజర్వేషన్ సీలింగుకు వ్యతిరేకంగా అప్పటి సుప్రీంకోర్టు ధర్మాసనం 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉండాలని మెజారిటీ బీసీల రిజర్వేషన్ను పూర్తిగా అడ్డుకున్నది.

 Supreme Court Judgement On Ews Quota Reservations Details, Supreme Court Judgeme-TeluguStop.com

అప్పుడు ఒక న్యాయనీతి, ఇప్పుడు ఒక మనువు నీతా?క్రిమిలేయర్ పేరుతో ఆర్థికంగా స్థిరత్వం కలిగిన ఓబీసీలను రిజర్వేషన్లు ఉపయోగించకుండా అడ్డుకున్నది మనువాదం కాదా?ఎటు తిరిగి 50% రిజర్వేషన్ సీలింగ్ను ఎత్తివేయడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా దామాషా ప్రకారం బీసీలకు 53%, ఎస్సీలకు 22%, ఎస్టిలకు 13% రిజర్వేషన్లు పెంచడం ఇప్పటి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం న్యాయబద్ధమైనది.ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు విద్యా సంస్థల్లో ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌లను ప్రవేశపెట్టిన 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 యొక్క చెల్లుబాటును నవంబర్ 7, సోమవారం సుప్రీంకోర్టు 3:2 మెజారిటీ సమర్థించింది.10 జనవరి 2019న పార్లమెంట్ రాజ్యాంగం 103వ సవరణ చట్టం రెండు రోజులలో ఎలాంటి ఉద్యమాలు లేకుండనే ఆఘమేఘాలపైన ఆమోదించింది.మెజారిటీ బెంచ్‌లో ఈడబ్ల్యూఎస్ సవరణను సమర్థించిన న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, బేలా త్రివేది మరియు జెబి పార్దివాలా ఉన్నారు.

Telugu Ews Cremelayer, Ews Quota, Ews, Lalit Bhatt, Maheshwari, Supreme-Latest N

చీఫ్ జస్టీస్ లలిత్ భట్ అసమ్మతిని చెప్పీన్నప్పటికీ, 5 మంది న్యాయమూర్తుల బెంచ్‌లోని కోటాను సమర్థించే మెజారిటీ అభిప్రాయం మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సక్రమమే అనే తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం.ఆర్టికల్ 15 (4)లో ఎస్సీఎస్టీబిసి మైనారిటీలను మినహాయించడం మరియు 50 శాతం సీలింగ్ పరిమితిని ఉల్లంఘించడం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమే.50% సీలింగ్ పరిమితి అనువైనది కాదు అని జస్టిస్ మహేశ్వరి ఇప్పుడు చెప్పడం న్యాయం సమ్మతం కాదు.సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటుతనానికి గురైనవారిని మినహాయించడం వివక్షపూరితమైనదిగా చెప్పలేము అని జస్టిస్ త్రివేది చెప్పడం రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడమే.

ఇది ఈడబ్ల్యూఎస్ అసమంజసమైన వర్గీకరణ అని చెప్పలేము.ఈడబ్ల్యూఎస్ని ప్రత్యేక తరగతిగా పరిగణించడం సహేతుకమైన వర్గీకరణ అవుతుంది” అని జస్టిస్ మహేశ్వరితో ఏకీభవిస్తూ జస్టిస్ త్రివేది అనడం ఆదిపత్య కులాలను పీడిత కులాలతో సమానులుగా చూడటమే.

Telugu Ews Cremelayer, Ews Quota, Ews, Lalit Bhatt, Maheshwari, Supreme-Latest N

మన రాజ్యాంగం వివక్షను అనుమతించదు.ఈ రాజ్యాంగ సవరణ సామాజిక న్యాయానికి, తద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించేలా ఉంది.ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందుతున్నవారు మెరుగ్గా ఉన్నారని మనను భ్రమింపజేసే సవరణ ఇది.సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఈ కోటా నుంచి తొలగించడం తప్పు.వారు పొందుతున్నట్టుగా చెబుతున్న ప్రయోజనాలను ఉచిత పాసులుగా పరిగణించకూడదు.వారికి జరిగిన అన్యాయానికి పరిహారం ఇచ్చే విధానం అది.సామాజిక మూలాల ఆధారంగా వారిని ఈ కోటా నుంచి మినహాయించడం సమానత్వానికి విఘాతం కలిగించడమే.రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని దాటడం వర్గీకరణలకు దారితీస్తుంది.

సమానత్వ హక్కు కాస్తా.రిజర్వేషన్లు పొందడమే హక్కుగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube