అదానీ గ్రూప్ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యలను ధర్మాసనం విచారించనుంది.
అదానీ గ్రూప్ వ్యవహారంపై న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు.సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలంటూ పిటిషన్ వేశారు.
ఈ క్రమంలో హిండెన్ బర్గ్ పై దర్యాప్తునకు ఆదేశించాలని ఎంఎల్ శర్మ పిటిషన్ లో పేర్కొన్నారు.కాగా అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే సంస్థ అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
అదానీ గ్రూప్ తన షేర్ల ధరలు, ఖాతాల్లో మోసాలకు పాల్పడుతుందని హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపణలు చేసింది.