రోజాను హైకోర్టుకు వెళ్ల‌మ‌న్న సుప్రీం

త‌న ఎన్నిక చెల్లదంటూ దాఖ‌లైన పిటీష‌న్‌ను కొట్టి వేయాలంటూ వైకాపా ఎమ్మెల్యే రోజా దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను సుప్రింకోర్టు తోసిపుచ్చింది.ఆదివారం రోజా వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపడుతూ…కౌంటర్‌ దాఖలు చేసేందుకు రోజాకు అవకాశం ఇవ్వాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేస్తూ, రోజాను హైకోర్టులో త‌న వాద‌న వినిపించుకోవాల‌ని సూచించింది.

 Supreme Court Direct To Roja-TeluguStop.com

2014లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రోజా గెలుపొంద‌గా, రాయుడు అనే ఆమె ఎన్నిక చెల్ల‌దంటూ హైకోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే .దీంతో రోజా ఆ ఫిర్యాదు కొట్టి వేయాల‌ని విన‌తిస్తూ, అప్పీలు దాఖ‌లు చేయ‌టంతో రెండింటినీ క‌లిపి విచారించేందుకు హైకోర్టు స‌మాయుత్త‌మైంది.హైకోర్టు తీరును త‌ప్పుబ‌డుతూ , ఈ నిర్ణయం చట్ట విరుద్ధమని రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం కోర్టు, ఏడాది చివరినాటికి వైసీపీ ఎమ్మెల్యే రోజా పిటిషన్ పై విచారణ పూర్తిచేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube