Rajinikanth Balakrishna: కంటి చూపుతో చంపేయడం బాలకృష్ణకు మాత్రమే సాధ్యం: రజనీకాంత్

నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) శత జయంతి ఉత్సవాలలో భాగంగా విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 Superstar Rajinikanth Praises Balakrishna At Ntr Shatajayanthi Celebrations-TeluguStop.com

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రజనీకాంత్ ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ ప్రభావం తనపై ఏ స్థాయిలో ఉందనే విషయాల గురించి తెలియజేశారు.

అదేవిధంగా నందమూరి నట సింహం బాలకృష్ణ(Balakrishna) గురించి కూడా రజనీకాంత్ మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు.

ఒక్క కంటి చూపుతోనే చంపేసే నా మిత్రుడు ఒక్క తన్ను తంతే జీపు 30 ఫీట్లు ఎగిరి పడుతుంది.ఇలాంటి సన్నివేశాలలో రజనీకాంత్ కాదు అమితాబచ్చన్ కాదు, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఇలా ఎవరు చేసిన జనాలు ఒప్పుకోరు.కేవలం బాలయ్య మాత్రమే ఇలాంటి సన్నివేశాలలో నటిస్తే జనాలు ఒప్పుకుంటారని ఆదరిస్తారని రజనీకాంత్ తెలిపారు.

ఎందుకంటే బాలకృష్ణలో ప్రేక్షకులందరూ ఎన్టీఆర్ గారిని చూస్తున్నారని, ఎన్టీఆర్ యుగపురుషుడు ఆయన ఏం చేసినా ఒప్పుకుంటారని రజినీకాంత్ ఈ సందర్భంగా తెలియజేశారు.

నందమూరి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నారు.ఇక ప్రస్తుతం ఈయన వయసు పైబడుతున్న వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.తాజాగా వీరసింహారెడ్డి సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో బాలయ్య పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube