సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) సినిమా అంటే సినిమా మొదలైనప్పటి నుంచి విపరీతమైన క్రేజ్ ఉంటుంది.అయితే అది ఒకప్పటి మాట రజినీ ఈమధ్య వరుస ఫ్లాపులు అందుకోవడం వల్ల ఆయన సినిమాల మీద ఆడియన్స్ లో ఆసక్తి తగ్గిందని తెలుస్తుంది.
ప్రస్తుతం రజినీకాంత్ జైలర్( Jailer ) సినిమా సెట్స్ మీద ఉంది.ఈ సినిమాకు ఆడియన్స్ లో ఎలాంటి బజ్ లేదు.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ మాస్ లుక్ తో కనిపిస్తున్నారు.సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు రజిని.
అయితే జైలర్ సినిమా ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకపడుతుంది.కోలీవుడ్( Kollywood ) లో సెట్స్ మీద ఉన్న చాలా సినిమాల గురిచి అక్కడ మీడియా రెగ్యులర్ న్యూస్ వేస్తుంది కానీ జైలర్ కి సంబంధించిన న్యూస్ మాత్రం బయటకు రావట్లేదు.
అయితే ఇదంతా కూడా మేకర్స్ ప్లాన్ లో భాగమే అంటున్నారు.సినిమా థియేటర్ లో సర్ ప్రైజ్ చేస్తుంది అందుకే లో ప్రొఫైల్ లో సినిమాను ఉంచుతున్నారట.
భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అవడం కన్నా ఇలా అంచనాలు లేకుండా వచ్చి హిట్ పడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది.మొత్తానికి జైలర్ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఎగ్జైటెడ్ గా ఉన్నారు.