అతనికి ఖరీదైన బహుమతి ఇచ్చిన రజినీకాంత్.. కారణం ఏంటంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అన్నాత్తే. ఇందులో రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథతో తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది.ఈ సినిమాలో సీనియర్ నటి కుష్బూ కూడా ఒక కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.

ఈ సినిమాకు సిరుతై శివ దర్శకత్వం వహించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

Advertisement

ఓటీటీ లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

రజనీకాంత్ తను నటించిన అన్నాత్తే మంచి కలెక్షన్లను సాధించడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు.ఈ క్రమంలోనే ఆ సినిమా దర్శకుడు అయినా సిరుతై శివ ఇంటికి వెళ్లి అతని కి సర్ప్రైజ్ గిఫ్ట్ లు అందజేశారు.

దర్శకుడికి బహుమతిగా తలైవా రజనీకాంత్ గోల్డ్ చైన్ ను అందజేసినట్లు తెలుస్తోంది.

త్వరలోనే వీరిద్దరూ కలిసి సన్ పిక్చర్స్ బ్యానర్లో మరో సినిమాను తీయబోతున్నారు అంటూ కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందా? వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నరా? అన్న విషయాలు తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్, జగపతి బాబు, అభిమన్యు సింగ్, సీనియర్ నటి కుష్బూ, మీనా, సూరి, సత్యన్, సతీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు