‘SSMB28’కు కూడా లీకుల సెగ.. సతమతం అవుతున్న టీమ్!

ప్రెజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు.ఎన్నో రోజుల గ్యాప్ తర్వాత ఇటీవలే షూట్ లో పాల్గొన్న మహేష్ బాబు ప్రజెంట్ ఫుల్ ఫోకస్ తో షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

 Superstar Mahesh Look Leaked From Ssmb 28 Sets-TeluguStop.com

మహేష్, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Telugu Jagapathi Babu, Mahesh Babu, Ssmb, Mahesh, Maheshleaked-Movie

సర్కారు వారి పాట వంటి ఘన విజయం తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమాలో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది.కీలక యాక్షన్ ఘట్టాలను డైరెక్టర్ చిత్రీకరిస్తున్నారు.

Telugu Jagapathi Babu, Mahesh Babu, Ssmb, Mahesh, Maheshleaked-Movie

జగపతిబాబు, మహేష్ బాబు మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కుతుండగా ఈ సినిమా సెట్స్ నుండి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి.ఈ లీక్స్ ఇప్పుడు మేకర్స్ కు తలనొప్పిగా మారాయి.మహేష్ బాబు అదిరిపోయే మాస్ లుక్ లో ఉన్న పిక్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.నిర్మాతలు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాలు నిర్మిస్తున్నారు.

Telugu Jagapathi Babu, Mahesh Babu, Ssmb, Mahesh, Maheshleaked-Movie

కానీ ఇలాంటి లీక్స్ సినిమాకు వల్ల సినిమాకు భారీ నష్టం తప్పదు.ఇలాంటి లీక్స్ సినిమాలకు ఇబ్బందిగా మారతాయని మూవీ నుండి అఫిషియల్ గా టీమ్ రిలీజ్ చేసే వరకు ఇలాంటి లీక్స్ చేయడం సరికాదని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టీమ్ కూడా గట్టి చర్యలు తీసుకోవాలని మహేష్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube