టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్( RRR )గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.రికార్డుల మీద రికార్డులు ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది.
కలెక్షన్ల పరంగా అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు.
సినిమా విడుదల అయ్యి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన నటీనటుల పేర్లు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్నాయి.ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి హీరో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్( Ram charan ) ల పేర్లు మారుమోగుతున్నాయి.ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే ఎన్నో విషయాలలో రికార్డులను తిరగ రాసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.ఇకపోతే జపాన్( Japan ) లాంటి దేశాలలో ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో ఆడుతూనే ఉంది.
ఈ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సినిమా మరో రికార్డుని బ్రేక్ చేసింది.

అదేమిటంటె ఈ సినిమాను మొదలుపెట్టిన స్టార్ మా వారు మంచి ప్లానింగ్ తో స్పెషల్ టెలీకాస్ట్ చేశారు.ఒక్కటంటే ఒక్క బ్రేక్ కూడా లేకుండా ప్లాన్ చేసిన ఈ సినిమాకు సాలిడ్ రేటింగ్ నమోదైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ సినిమా స్పెషల్ టెలికాస్ట్ కి ఏకంగా 8.17 టిఆర్పి రేటింగ్స్ నమోదు అయినట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమా ఆశ్చర్యకర రేటింగ్ ని రాబట్టిందని చెప్పవచ్చు.
అలాగే స్టార్ మా వారి ఇంట్రెస్టింగ్ ప్లానింగ్ కూడా బాగానే ప్లస్ అయిందని చెప్పవచ్చు.మరోవైపు చిత్ర బృందం ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







